Sunday, May 9, 2021

ఆర్ఆర్ తో మ్యాచ్..టాస్ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ముంబై..

 ఐపీఎల్‌ 14వ సీజన్‌లో భాగంగా అరుణ్‌జైట్లీ స్టేడియంలో మరికాసేపట్లో ఆసక్తికర పోరు జరగనుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబై ఇండియన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో టాస్‌ గెలిచిన ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. వరుసగా విఫలమవుతున్న ఇషాన్‌ కిషన్‌ స్థానంలో నాథన్‌ కౌల్టర్‌ నైల్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు రోహిత్‌ చెప్పాడు. ఇప్పటి వరకూ ఐదు మ్యాచ్‌లాడిన ముంబై రెండింటిలో మాత్రమే గెలుపొందగా.. రాజస్థాన్ రాయల్స్ కూడా ఐదు మ్యాచ్‌లాడి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇక ఐపీఎల్‌లో ఇరుజట్ల పోరు పరిశీలిస్తే..  ఇప్పటివరకు 23 మ్యాచ్‌ల్లో తలపడగా.. ముంబై, రాజస్తాన్‌లు చెరో 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఒక మ్యాచ్‌లో మాత్రం ఫలితం తేలలేదు.

Advertisement

తాజా వార్తలు

Prabha News