Tuesday, April 16, 2024

Breaking: తక్కువ స్కోరుకే చెమటోడ్చిన రాజస్థాన్​.. చెన్నైపై 5 వికెట్ల విజయం

చెన్నైతో జరుగుతున్న కీలకమైన మ్యాచ్​లో రాజస్థాన్ రాయల్స్​ జట్టు చెమటోడ్చింది. 16.2 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 112 పరుగులు మాత్రమే చేసింది. అయితే చెన్నైని కట్టడి చేయడంలో రాజస్థాన్​ బౌలర్లు విజయం సాధించారు. దూకుడుగా ఆడి చెన్నైని పెద్దగా స్కోరు చేయకుండా 150 పరుగుల వరకే అడ్డుకున్నారు. కానీ, అంతే దీటుగా బ్యాట్స్​మన్​ తమ ప్రతాపాన్ని చూపలేకపోయారు. దీంతో ​త్వరత్వరగా వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది. అయినా చెన్నైపై గెలుపు జెండా ఎగరేసింది రాజస్థాన్​ జట్టు..

కాగా, రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై బ్యాటింగ్ లైనప్ తడబడింది. మొయీన్ అలీ (93) ధాటిగా ఆడినప్పటికీ.. అతనికి ఎవరి నుంచి సరైన సహకారం లభించలేదు. ఆరంభంలోనే రుతరాజ్ గైక్వాడ్ (2) పెవిలియన్ చేరగా.. పవర్‌ప్లే ముగిసిన కాసేపటికే డెవాన్ కాన్వే (16) కూడా అవుటయ్యాడు. ఇలాంటి సమయంలో ఇన్నింగ్స్ నిర్మిస్తాడనుకున్న జగదీశన్ (1), రాయుడు (3) కూడా విఫలమయ్యారు.

దీంతో అలీకి జత కలిసిన కెప్టెన్ ధోనీ (26) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. అయితే ఇన్నింగ్స్ వేగం పెంచే క్రమంలో చాహల్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్ తొలి బంతికే భారీ షాట్ ఆడబోయిన అలీ కూడా పెవిలియన్ చేరాడు. చివర్లో మిచెల్ శాంట్నర్ (1 నాటౌట్), సిమర్‌జీత్ సింగ్ (3 నాటౌట్) పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి చెన్నై జట్టు 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement