Wednesday, April 24, 2024

వావ్ అనిపిస్తున్న RR కొత్త జెర్సీ వీడియో

ఐపీఎల్ టీమ్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ సీజ‌న్‌కు ముందు తమ కొత్త జెర్సీని లాంచ్ చేసింది. జైపూర్‌లోని స‌వాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఈ జెర్సీ లాంచ్ క‌ళ్లు చెదిరే రీతిలో జ‌రిగింది. ఈ జెర్సీని ఆవిష్క‌రించ‌డం కోసం స్టేడియంలో భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ముందు ఓ వీడియో మాంటేజ్ ప్లే చేసిన త‌ర్వాత రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ప్లేయ‌ర్స్ త్రీడీ ప్రొజెక్ష‌న్స్ రూపంలో కొత్త జెర్సీల్లో క‌నిపించారు. ఇప్ప‌టికే మిగ‌తా టీమ్స్ జెర్సీ లాంచ్‌ల‌ను నిర్వ‌హించినా.. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జెర్సీ లాంచే అద్భుతంగా ఉన్న‌ద‌ని ఫ్యాన్స్ అంటున్నారు. ప్ర‌స్తుతం ముంబైలో ఉన్న రాజ‌స్థాన్ టీమ్‌.. ఈ నెల 12న పంజాబ్ కింగ్స్‌తో తొలి మ్యాచ్ ఆడ‌నుంది. కాగా ఆర్ ఆర్ కెప్టెన్ గా సంజూ శాంసన్ వ్యవహరిస్తున్నాడు. గత సంవత్సరం ఆర్సీబీలో కీలక పాత్ర పోషించిన క్రిస్ మోరీస్ ఇప్పుడు ఆర్ ఆర్ తరఫున బరిలో దిగనున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement