Tuesday, April 23, 2024

భారత్‌- బంగ్లాదేశ్‌ మ్యాచ్‌కు వర్షం ముప్పు

బంగ్లాదేశ్‌తో బుధవారం(నవంబర్‌ 2)నాడు అడిలైడ్‌ వేదికగా భారత్‌ తలపడునున్న మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. వాతావరణ శాఖ అధికారుల కథనం ప్రకారం… ఆకాశమంతా మేఘావృతమై చిరుజల్లులు కురిసే అవకాశముంది. మంగళవారంనాడు ఇరు జట్లు ప్రాక్టీస్‌ కోసం మైదానంలోకి అడుగుపెట్టగా, చిరుజల్లులు కురవడంతో ఇండోర్‌లోనే ప్రాక్టీస్‌ చేయాల్సి వచ్చింది. బుధవారంనాడు కూడా ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం 60శాతముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నమెంట్‌లో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ప్రధానంగా మెల్‌బోర్న్‌ వేదికగా జరగాల్సిన మ్యాచ్‌లు వర్షం కారణంగా బంతి పడకుండానే రద్దయిన విషయం తెలిసిందే. ఇండియా జట్టు తొలి మ్యాచ్‌లో తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై అద్భుత విజయం సాధించింది. ఆ తర్వాత నెదర్లాండ్స్‌పై ఘనవిజయం సాధించింది. అయితే ఆ తదుపరి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో రోహిత్‌ సేన పరాజయాన్ని చవిచూసింది. దీంతో భారత జట్టు సెమీస్‌ చేరాలంటే, నేడు ఆడిలైడ్‌ వేదికగా జరుగనున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై విజయం సాధించాల్సిన పరిస్థితి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement