Thursday, April 25, 2024

టీ-20 వరల్డ్ కప్ భారత్‌లో నిర్వహించడంపై ఆలోచించండి: కమిన్స్

కరోనా తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో టీ-20 ప్రపంచకప్‌ను భారత్‌లో నిర్వహించకపోవడమే మంచిదని ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ ప్యాట్ కమిన్స్ అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది చివర్లో భారత్‌లో మూడో దశ విజృంభిస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో కమిన్స్ స్పందించాడు. `టీ-20 ప్రపంచకప్‌నకు ఇంకా ఆరు నెలల సమయం ఉంది. దానిపై ఇప్పుడే మాట్లాడడం సరికాదు. అయితే ఈ ప్రపంచకప్ నిర్వహణ భారత్ వనరులను దెబ్బతీస్తుందని తెలిసినా, సురక్షితం కాదని తెలిసినా దానిని యూఏఈకి తరలించాలి. భారతీయులకు ఏది అవసరమో క్రికెట్ వర్గాలు ప్రభుత్వాలతో చర్చించాలి. గతేడాది యూఏఈలో నిర్వహించిన ఐపీఎల్ అద్భుతంగా జరిగింది. టీ-20 ప్రపంచకప్ నిర్వహణ విషయంలో అందరి అభిప్రాయాలు తెలుసుకుని ముందుకు వెళితే మంచిద`ని కమిన్స్ సూచించాడు. ఈ ఏడాది చివర్లో జరగబోయే టీ-20 ప్రపంచకప్‌నకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement