Saturday, April 20, 2024

డబ్ల్యూటీఎ టోర్నీ నుంచి తప్పుకున్న ఒసాకా..

ఆస్ట్రేలియా ఓపెన్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ నవోమీ ఒసాకా డబ్యూటీఎ టోర్నీ నుంచి తప్పుకొంది. బాడీ షాక్‌కు గురవడంతో టోర్నీ నుంచి వైదొలిగినట్లు ట్విట్ట‌ర్‌ వేదికగా వెల్లడించింది. ఒసాకా అనూహ్య నిర్ణయంతో సెమీస్‌కు దూరమైంది. ఒసాకా వైదొలగడంతో వెరోనికా నేరుగా డబ్ల్యూటీఎ టోర్నీ ఫైనల్‌కు చేరుకుంది. టైటిల్‌ పోరులో రెండో సీడ్‌ సిమోనా హాలెప్‌, వెరోనికా కుదెర్మెతోవా నేడు తలపడనున్నారు.

కాగా ఒసాకా టిటర్‌ వేదికగా మాట్లాడుతూ విరామం తర్వాత వరుసగా కీలక మ్యాచ్‌లు ఆడటంతో శరీరం షాక్‌కు గురయిందని ట్వీట్‌లో పేర్కొంది. గాయంతో టోర్నీ నుంచి వైదొలగడం విచారకరం. గతవారం రోజులుగా మద్దతిచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ లవ్‌సింబల్‌ ఎమోజీని పోస్టు చేసింది. ఈ నెల 17 నుంచి ఆస్ట్రేలియా ఓపెన్‌ ప్రారంభం కానుండగా ఒసాకా ఆడే అవకాశం ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement