Saturday, October 5, 2024

Nicholas Pooran | టీ20లో సిక్సర్ల రికార్డ్ !

వెస్టిండీస్ స్టార్ బ్యాటర్, పవర్ హిట్టర్ నికోలస్ పూరన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 150కి పైగా సిక్సర్లు బాదిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 63 మ్యాచ్‌లు ఆడిన పూర‌న్.. ఏకంగా 151 సిక్సర్లు బాదాడు.

ప్రస్తుతం జరుగుతున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో (సీపీఎల్) మంచి ఫామ్‌లో నికోల‌స్ పూర‌న్.. ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టుకు ఆడుతున్నాడు. టోర్నీలో భాగంగా తాజాగా సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 43 బంతుల్లో 93 పరుగులు బాది నాటౌట్‌గా నిలిచాడు.

ఈ ఇన్నింగ్స్‌లో కొట్టిన 7 సిక్సర్లతో కలుపుకొని ఈ క్యాలెండర్ ఏడాదిలో అతడి మొత్తం సిక్సర్ల సంఖ్య 150 దాటింది. అంతేకాదు ఈ ఏడాది అతడు 2000 టీ20 పరుగులను కూడా పూర్తి చేసుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement