Thursday, April 25, 2024

మట్టికోట మహారాజు రఫెల్‌ నాదల్‌కు చుక్కెదురు..

ఇన్నాళ్లు క్లే కోర్టులో అపజయమన్నదే ఎరుగకుండా ప్రత్యర్థుల పనిపట్టిన నాదల్‌కు సెర్బియా వీరుడు జొకోవిచ్‌ చెక్‌ పెట్టాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో తిరుగేలేని నాదల్ ఈ సారి అనూహ్యంగా నిష్క్రమించాడు. హోరాహోరీగా సాగిన పోరులో ప్రపంచ నంబర్‌వన్‌ జొకో చేతిలో నాదల్‌ ఓటమి ఎదుర్కొన్నాడు. నాలుగున్నర గంటల పాటు జరిగిన మ్యాచ్‌లో విజయం కోసం ఇద్దరు కొదమసింహాల్లా తలపడ్డారు. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఎవరెస్ట్‌ శిఖరమంతటి రఫాను ఓడించిన జొకో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. జొకోవిచ్‌ 3-6, 6-3, 7-6 (7/4), 6-2తో నాదల్‌పై విజయం సాధించాడు. ఆదివారం జరిగే టైటిల్‌ పోరులో గ్రీకువీరుడు సిట్సిపాస్‌తో జొకో తలపడనున్నాడు. మహిళల సింగిల్స్‌ ఫైనల్లో అనస్తాసియాను ఓడించిన క్రెజికోవా తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను తన పేరిట రాసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement