Friday, April 26, 2024

Mount Everest | ఎవరెస్ట్​ అధిరోహించిన తొలి తమిళనాడు మహిళ.. సెల్వికి ఘన స్వాగతం

తమిళనాడుకు చెందిన ఓ 34 ఏళ్ల మహిళ ఎవరెస్ట్​ శిఖరాన్ని అధిరోహించిన ఆ రాష్ట్ర తొలి మహిళగా రికార్డు నెలకొల్పింది. విరుదనగర్ జిల్లా జోయల్​పట్టి గ్రామానికి చెందిన ముత్తమిళ్​ సెల్వికి ఈ ఘనత సాధించి స్వరాష్ట్రానికి రావడంతో ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది.  సెల్వి గతంలో కళ్లకు గంతలు కట్టుకుని పర్వతారోహణ చేయడం వంటి ఎన్నో విజయాలు సాధించింది. విలువిద్యలో కూడా ఆమె నిపుణురాలు

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

తమిళనాడులోని జోయల్‌పట్టి గ్రామానికి చెందిన ముత్తమిళ్ సెల్వి ఎవరెస్ట్​ శిఖరాన్ని అధిరోహించింది. ఆ తర్వాత నేపాల్ నుంచి ఇవ్వాల (బుధవారం) చెన్నై విమానాశ్రయంలో దిగడంతో ఆమెకు ఘనస్వాగతం లభించింది. ఆమె మే 23వ తేదీన ఎవరెస్ట్​ని అధిరోహించింది. ఈ లక్ష్యం చేరుకోవడానికి 56 రోజులు పట్టింది. ఆపై ఖాట్మండులోని బేస్ క్యాంప్‌కు తిరిగి వచ్చింది. ముత్తమిళ్ సెల్వి గతంలో కళ్లకు గంతలు కట్టుకుని పర్వతాలు ఎక్కడం వంటి ఎన్నో విజయాలు సాధించింది. విలువిద్యలో కూడా నిపుణురాలు.

ఇక.. తమిళనాడు యువజన సంక్షేమం, క్రీడల శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ముత్తమిళ్ సెల్విని ఫోన్‌లో సంప్రదించి ఆమె ఘనతను అభినందించారు. మూడేళ్లుగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు శిక్షణ తీసుకున్నానని, తమిళనాడు ప్రభుత్వానికి, తన కోచ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు సెల్వి. ఈ యాత్రకు సీఎం ఎంకే స్టాలిన్ గతంలో ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల సాయం అందించగా, మంత్రి ఉదయనిధి స్టాలిన్ తన తరఫున రూ.15 లక్షల సాయం అందించారని తెలిపింది. మహిళలు ప్రయత్నిస్తే సాధించలేనిది అంటే ఏదీ లేదు.. అత్యున్నత శిఖరాలన్నీ అధిరోహించడమే నా తర్వాతి లక్ష్యం  అని సెల్వి మీడియాకు చెప్పింది. అంతేకాకుండా ముత్తమిళ్ సెల్వి జపనీస్ కూడా నేర్పుతుంది. తన ఇద్దరు కుమార్తెలతో సహా తన కుటుంబంతో చెన్నైలోని తాంబరంలో  ప్రస్తుతం నివస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement