Friday, March 29, 2024

Big Breaking | ముంబయి టాపార్డర్​ ఫెయిల్​.. లక్నో టార్గెట్​ ఎంతంటే!

ఎలిమినేటర్​ రౌండ్​లో భాగంగా ఇవ్వాల జరుగుతున్న మ్యాచ్​లో ముంబయి టాపార్డర్​ తడబాటుకు గురయ్యింది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 182 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే.. లక్నో బౌలర్లలో నవీన్​ ఉల్​ హక్​ కీలక నాలుగు వికెట్లు తీసి ముంబయి వెన్నువిరిచాడు. ఆ తర్వాత యశ్​ రవిసింగ్​ ఠాకూర్​ కూడా మూడు వికెట్లు తీశాడు.

ఇక.. ముంబయి టీమ్​లో ఇషాన్​ కిషన్​ (15), రోహిత్​ శర్మ (11), కామెరున్​ గ్రీన్​ (41), సూర్యకుమార్​ యావ్​ (33), తిలక్​ వర్మ (26), టిమ్​ డేవిడ్​ (13) జోర్డాన్​ (4) పరుగులు మాత్రమే చేయగలిగారు. వధేరా 12 బంతుల్లో 23 పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్​లో వధేరా దంచికొట్టడంతో స్కోరు  బోర్డు కాస్త మెరుగయ్యింది.

ఇక.. లక్నో టార్గెట్​ 183 పరుగులుగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement