Saturday, April 20, 2024

ధోని అవసరం టీం ఇండియాకు చాలా ఉంది: మైఖేల్ వాన్..

టీ20 వరల్డ్ కప్ కి టీమిండియా మెంటర్ గా ధోని నియామకంపై విభిన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. ఇక తాజాగా దీని పై ఇంగ్లాండ్ మాజీ క్రి కెటర్ మైఖేల్ వాన్ స్పందించాడు. ధోనిని మెంటార్ గా నియమించడం మంచి నిర్ణయమేనని దానిని సమర్ధించాడు. ధోని వంటి ఆటగాడు టీం ఇండియా డ్రెస్సింగ్ రూమ్ లో ఉంటె చాలా మేలు జరుగుతుందని చెప్పాడు. ధోని టీ20 క్రికెట్ లో ఒక ఉత్తమమైన కెప్టెన్. అతని నిర్ణయాలు దాదాపుగా ఎప్పుడు సరైనవిగానే ఉంటాయి. అతను ఆటను అప్పటి పరిస్థితులను చాలా చక్కగా అంచనా వేస్తాడు. కాబట్టి ధోని బుర్ర టీం ఇండియాకు చాలా అవసరం అని పేర్కొన్నారు. అయితే వచ్చే నెల 17 ప్రపంచ కప్ ప్రారంభం కానుండగా భారత్ 24న పాకిస్థాన్ తో మొదటి మ్యాచ్ ఆడనుంది.

ఇది కూడా చదవండి: మళ్లీ వైసీపీ గూటికి వంగవీటి రాధా?

Advertisement

తాజా వార్తలు

Advertisement