Friday, March 29, 2024

ఓటమి భాదతో నేమార్ కంటతడి.. ఓదార్చిన మోస్సీ..

కోపా అమెరికా కప్ ఫైనల్లో అర్జెంటీనా చేతిలో బ్రెజిల్ ఓడిపోవడంతో ఆ జట్టు స్టార్ ఆటగాడు నేమార్ కన్నీటిపర్యంతమయ్యాడు. తీవ్ర వేదనకులోనైన తన మిత్రుడు నేమార్ ను అర్జెంటీనా స్టార్ మెస్సీ హత్తుకుని ఓదార్చడం అందరినీ ఆకట్టుకుంది. ఓ చిన్న పిల్లవాడిలా బాధపడుతున్న నేమార్ ను హృదయానికి హత్తుకుని అతని వేదనను తగ్గించే ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నేమార్, మెస్సీ… ఫుట్ బాల్ ప్రపంచంలో రారాజులు. ఒకరేమో బ్రెజిలియన్, మరొకరేమో అర్జెంటీనా జాతీయుడు. కానీ వీరిద్దరినీ కలిపింది బార్సిలోనా ఫుట్ బాల్ క్లబ్. గతంలో వీరిద్దరూ యూరప్ లీగ్ పోటీల్లో బార్సిలోనా క్లబ్ కు ప్రాతినిధ్యం వహించారు. తమ సాకర్ నైపుణ్యంతో బార్సిలోనా జట్టుకు అనేక విజయాలు అందించారు. ఆ సందర్భంగా ఏర్పడిన చెలిమి ఇప్పటికీ చెక్కుచెదరలేదు. తాజాగా కోపా అమెరికా టోర్నీ ఫైనల్ ముగిసిన తర్వాత తమ అనుబంధాన్ని మరోసారి చాటుకున్నారు.

ఇది కూడా చదవండి: ఏపీ జాబ్ క్యాలెండర్ పై విద్యార్థుల ఆందోళనలు..మద్దతు తెలిపిన మావోలు..

Advertisement

తాజా వార్తలు

Advertisement