Monday, October 7, 2024

Mesmerizing | ధోనీ మ్యాజిక్​.. గిల్​ అవుట్​!

అహ్మదాబాద్​ స్టేడియంలో జరగుతున్న ఐపీఎల్​ ఫైనల్​ మ్యాచ్​లో గుజరాత్​ బ్యాటింగ్​ చేస్తోంది. కాగా ఓపెనర్లు గిల్​, సాహా స్కోరుబోర్డుని పరుగులు పెట్టించే క్రమంలో చెన్నై కెప్టెన్​, వికెట్​ కీపర్​ ధోనీ మ్యాజిక్​ చేశాడు. ఏడో ఓవర్​లో రవీంద్ర జడేజా వేసిన స్పిన్​లో మూడు సార్లు గిల్​ అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అయితే.. అదే ఓవర్​లో ఆఖరి బంతిని కవ్వించేలా వేయడంతో అది బ్యాట్​ను తాకుతున్నట్టే వెళ్లి వికెట్ల వెనకాల ఉన్న ధోనీ చేతుల్లో పడింది. అయితే.. ఆ బాల్​ని కొట్టేందుకు ఫ్రంట్​ పూట్​ తీసుకున్న గిల్​ లెగ్​ని క్రీజ్​లో పెట్టకముందే క్షణంలో వెయ్యో వంతులో ధోనీ స్టంప్​ బెల్స్​ని గిరాటేసి చలాకీగా పక్కకు తప్పుకున్నాడు. ఇది చూసిన క్రికెట్​ అభిమానులు, స్టేడియంలోని జనం ఒక్కసారిగా అరుపులు, కేకలతో సంబురాలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement