ఎన్టీపీసీ జాతీయ ర్యాంకింగ్స్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో మహారాష్ట్రకు చెందిన మిహిత్ నితిన్ అపర్ కాంస్యం దక్కించుకున్నాడు. గచ్చిబౌలి మైదానంలో జరిగిన సబ్ జూనియర్ కాంపౌండ్ బాలుర విభాగంలో మూడోస్థానంలో నిలిచి కంచుపతకం కైవసం చేసుకున్నాడు. కాగా గతేడాది ఆగస్టులో జరిగిన ప్రపంచ యూత్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో మిహిర్ స్వర్ణపతకం సాధించాడు.

ఆర్చరీలో ప్రతిభ చూపిన మిహిర్ నితిన్ అపర్‌ను మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ సారంగపాణి అభినందించారు. మిహిర్‌తోపాటు అతడి తండ్రిని సాదరంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సారంగపాణి కుటుంబ సభ్యులతోపాటు సీనియర్ కార్టూనిస్ట్ నారూ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital