Thursday, April 25, 2024

లిట‌న్ దాస్ సెంచ‌రీ.. పాక్ పై తొలిటెస్టులో బంగ్లాదేశ్ 253\4

పాకిస్తాన్‌తో జ‌రుగుతున్న తొలిటెస్టులో బంగ్లాదేశ్ బ్యాట‌ర్ లిట‌న్ దాస్ సెంచ‌రీతో మెరిశాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసేస‌రికి బంగ్లాదేశ్ 4వికెట్ల న‌ష్టానికి 253ప‌రుగులు చేసింది. తొలుత ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాజ‌ట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.

బంగ్లా టాపార్డ‌ర్ విఫ‌ల‌మైనా వికెట్ కీప‌ర్ లిట‌న్ దాస్ (113) సెంచ‌రీతో ఆదుకోగా, ముష్ఫిక‌ర్ ర‌హీమ్ (82) ఇన్నింగ్స్ ను ముందుకు న‌డిపించి అజేయంగా నిలిచారు. తొలిరోజు 85ఓవ‌ర్ల‌లో 4వికెట్ల‌కు బంగ్లాదేశ్ 253ప‌రుగుల స్కోరు న‌మోదు చేసింది. పాక్ బౌల‌ర్ల‌లో షాహీన్ అఫ్రిది, హ‌స‌న్ అలీ, ఆష్ర‌ఫ్‌, సాజిద్ ఖాన్ త‌లో వికెట్ తీశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement