Saturday, April 20, 2024

జట్టులో లోపాలు సరిదిద్దుకుంటాం : రాహుల్‌ ద్రవిడ్‌

సౌతాఫ్రికాను సొంతగడ్డపై ఓడించి తొలిసారి టెస్ట్‌ సిరీస్‌ గెలుచుకోవాలన్న టీమిండియా కల సాకారం కాలేదు. 2-1తేడాతో సఫారీజట్టు టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుని భారత్‌పై అజేయ రికార్డును నిలబెట్టుకుంది. టెస్టు సిరీస్‌ అనంతరం జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను కూడా ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. భారతజట్టు దక్షిణాఫ్రికా చేతిలో వైట్‌వాష్‌కు గురవడాన్ని భారత్‌ అభిమానులును తీవ్రంగా నిరాశపరిచింది. ఆదివారం జరిగిన మూడో వన్డేలో భారత్‌ గెలుపు అంచులవరకూ పయనించి చివర్లో కుప్పకూలింది. దీంతో 4పరుగులు తేడాతో సౌతాఫ్రికా చివరివన్డేను సొంతం చేసుకుంది. టీమిండియా ఓటమిపై హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ స్పందించాడు. కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ విఫలమవడంపై వస్తున్న విమర్శలను ద్రవిడ్‌ ఖండించాడు. జట్టులో లోపాల కారణంగానే టీమిండియా ఓటమిపాలైందని చెపుతూ లోపాలను సరిచేసుకుంటామని తెలిపాడు.

ఈ ఏడాది దితియార్థంలో ప్రపంచకప్‌ ఉన్న సందర్భంలో భారత్‌జట్టు వరుసగా వన్డేసిరీస్‌లు ఆడనుంది. ఈక్రమంలో లోపాలను సరిచేసుకుని ముందుకువెళ్తామని ద్రవిడ్‌ పేర్కొన్నాడు. రెగ్యులర్‌ ఆల్‌రౌండర్లు లేని లోటు కనిపించిందని, 6,7,8 స్థానాల్లో ఆల్‌రౌండర్లు చేరితే మెరుగైన ఫలితాలు రాబట్టగలమని ద్రవిడ్‌ వివరించాడు. మిడిల్‌ ఓవర్లలో జట్టు మెరుగైన ప్రదర్శన చేయాలి. 20నుంచి 40ఓవర్ల మధ్యలో బ్యాటింగ్‌ మెరగవాలి. దక్షిణాఫ్రికా విజయం సాధించడానికి మిడిల్‌ ఓవర్లలో ఆ జట్టు రాణించడమే కారణమని ద్రవిడ్‌ వివరించాడు. రాహుల్‌ అంతర్జాతీయస్థాయి కెప్టెన్సీలో చాలా విషయాలు నేర్చుకుంటాడు. ఆటగాళ్ల ప్రతిభను అవసరానికి తగినట్లుగా వినియోగించుకుంటాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement