Tuesday, April 16, 2024

కేఎల్ రాహుల్ కి అపెండిసైటిస్.. సీజన్ కి దూరం..?

ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ కు గట్టి దెబ్బ తగిలింది. ఆ జట్టు కేప్టెన్ గా వ్యవహరిస్తున్న కేఎల్ రాహుల్ అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడు. కేఎల్ రాహల్ అపెండిసైటిస్ తో బాధపడుతున్నట్టు పంజాబ్ కింగ్స్ వర్గాలు వెల్లడించాయి. గత రాత్రి కేఎల్ రాహుల్ కడుపునొప్పికి గురికాగా, మందులు వాడినా నయం కాకపోవడంతో వైద్య పరీక్షలు నిర్వహించినట్టు ఓ ప్రకటనలో వెల్లడించారు. రాహుల్ అక్యూట్ అపెండిసైటిస్తో బాధపడుతున్నట్టు వైద్య పరీక్షల్లో వెల్లడైందని, ఇది శస్త్రచికిత్సతోనే నయం అవుతుందని, అందుకే అతడిని ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. కేఎల్ రాహుల్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు పంజాబ్ కింగ్స్ ఆకాంక్షించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement