Friday, November 29, 2024

IPL Mega Auction | 13 ఏళ్ల కుర్రాడికి జాక్ పాట్‌.. ఆర్సీబీకి భువి !

ఐపీఎల్‌ మెగా వేలంలో భాగంగా రెండవరోజు జరిగిన ఆక్షన్‌లో మొత్తంగా 38 మంది ఆటగాళ్లు అమ్ముడయ్యారు. వీరిలో టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ను బెంగళూరు భారీ ధరకు కొనుగోలు చేసింది. కనీస ధర రూ.2కోట్లుగా ఉన్న భువీ కోసం మొదట ముంబై, లక్నో పోటీపడ్డాయి. అయితే అనూహ్యంగా రేసులోకి వచ్చిన ఆర్‌సీబీ రూ.10.75 కోట్లకు అతడిని దక్కించుకుంది.

మరో ప్లేయర్‌ దీపక్‌ చాహర్‌ కూడా బంపర్‌ ఆఫర్‌ కొట్టేశాడు. ముంబై, పంజాబ్‌ అతడికోసం పోటీ పడగా, చివరకు రూ.9.25కోట్లకు ముంబై దక్కించుకుంది. ఇక‌ పేసర్‌ ముకేశ్‌ కుమార్‌ను రూ.8కోట్లకు ఢిల్లి దక్కించుకోగా, ఆకాశ్‌దీప్‌ను రూ.8కోట్లకు లక్నో సొంతం చేసుకుంది. తుషార్‌ పాండేను రూ.6.5కోట్లకు రాజస్థాన్‌ కొనగా, ద.ఆఫ్రికా ఆటగాడు మార్కో జాన్సెన్‌ను రూ.7కోట్లకు పంజాబ్‌ కింగ్స్‌ దక్కించుకుంది. అఫ్గాన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ గజన్‌ఫర్‌ను రూ.4.80 కోట్లకు ముంబై ఇండియన్స్‌ కొనుగోలు చేసింది.

13 ఏళ్ల కుర్రాడికి రూ.1.10 కోట్లు

2023-24 రంజీ ట్రోపీలో అసాధారణ ప్రతిబతో ఆకట్టుకున్న బీహార్‌కు చెందిన 13 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ ఐపీఎల్‌ వేలంలో రూ.1.10 కోట్ల ధర పలికాడు. ఇతడి కోసం రాజస్థాన్‌ రాయల్స్‌, ఢిల్లి క్యాపిటల్స్‌ పోటీపడ‌గా… చివరకు వైభవ్‌ను రాజస్థాన్‌ దక్కించుకుంది. ఈ మెగా ఆక్షన్‌లో అత్యంత పిన్న వయసు ప్లేయర్‌ ఇతడే కావడంవిశేషం.

డే-2 వేలంలో అమ్ముడైన టాప్‌ ప్లేయర్స్‌

- Advertisement -

1) భువనేశ్వర్‌ – 10.75- బెంగళూరు
2) దీపక్‌ చాహర్‌ – 9.75 – ముంబై
3) ముకేశ్‌ కుమార్‌ – 8 – ఢిల్లి
4) ఆకాశ్‌ దీప్‌ – 8 – లక్నో
5) మార్కో జాన్సెన్‌ – 7 – పంజాబ్‌
6) తుషార్‌ పాండే – 6.50 – పంజాబ్‌
7) నితీశ్‌రాణా – 5.75 – రాజస్థాన్‌
8) కృనాల్‌ పాండ్యా – 5.75 – బెంగళూరు
9) విల్‌ జాక్స్‌ – 5.25 – ముంబై
10) గజన్‌ఫర్‌ – 4.8 – ముంబై
11) వాషింగ్టన్‌ సుందర్‌- 3.20 – గుజరాత్‌
12) అన్షూల్‌ కాంబోజ్‌ – 3.04 – చెన్నై
13) టిమ్‌ డేవిడ్‌ – 3 – బెంగళూరు
14) షాబాజ్‌ అహ్మద్‌ – 2.40 – లక్నో
15) గెరాల్డ్‌ కొయెట్జీ – 2.40 – గుజరాత్‌
16) ఒమర్‌జాయ్‌ – 2.40 – పంజాబ్‌
17) సామ్‌ కర్రన్‌ – 2.40 – చెన్నై
18) జోష్‌ ఇంగ్లిష్‌ – 2.60 – పంజాబ్‌
19) సాయి కిషోర్‌ – 2 – గుజరాత్‌
20) స్పెన్సర్‌ జాన్సెన్‌ – 2 – గుజరాత్‌
21) డుప్లెసిస్‌ – 2 – ఢిల్లి
22) రోమన్‌ పావెల్‌ – 1.50 – కోల్‌కతా

అన్‌సోల్డ్‌ ప్లేయర్స్‌..

రెండవ రోజు వేలంలో పలువురు భారత ఆటగాళ్లకు నిరాశే మిగిలింది. అజింక్య రహానే, పృథ్వీషా, మయాంక్‌ అగర్వాల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, కేఎస్‌భరత్‌ను ఏ ఫ్రాంచైజీ కొనలేదు. విదేశీ ఆటగాళ్లలో కేన్‌ విలియమ్సన్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, ఆదిల్‌ రషీద్‌, కేశవ్‌ మహరాజ్‌, విజయ్‌కాంత్‌ వియస్కాంత్‌, అకీలా హొస్సేన్‌, ముజిబుర్‌ రెహ్మాన్‌, డారిల్‌ మిచెల్‌లు కూడా అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో మిగిలారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement