Thursday, April 18, 2024

ఐపీఎల్ స్పెష‌ల్‌.. భారీ స్కోర్లలో సీఎస్‌కేదే రికార్డు

ఐపీఎల్‌లో ఆదివారం రాత్రి చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు రెచ్చిపోయి ఆడింది. ముఖ్యంగా ఆ జట్టు ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే ఫోర్లు, సిక్సులతో డీవై పాటిల్‌ మైదానాన్ని హోరెత్తించాడు. దీంతో చెన్నై జట్టు 208 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఈ నేపథ్యంలో చెన్నై జట్టు అరుదైన రికార్డు నెలకొల్పింది. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు 200 ప్లస్‌ స్కోర్లు చేసిన జట్టుగా నిలిచింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు ఐపీఎల్‌లో ఇప్పటివరకు 23 సార్లు 200 పస్ల్‌ స్కోర్లు చేసింది.

ఈ జాబితాలో చెన్నై తర్వాతి స్థానంలో బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌ జట్టు ఉంది. ఆ జట్టు ఇప్పటి వరకు 21 సార్లు 200 పరుగుల కంటే ఎక్కువ భారీ స్కోర్లు నమోదు చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో పంజాబ్‌ కింగ్స్‌ (16 సార్లు), ముంబై ఇండియన్స్‌ (16 సార్లు), కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (14సార్లు), రాజస్థాన్‌ రాయల్స్‌ (14 సార్లు), సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (12సార్లు), ఢిల్లిd క్యాపిటల్స్‌ (10 సార్లు) ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement