Tuesday, May 30, 2023

Spl Story: కామన్వెల్త్​ గేమ్స్​లో భారత సత్తా.. టాప్​5లో ఇండియా, పసిడి పతకాలే టార్గెట్​!

జులై 28వ తేదీన ప్రారంభమైన కామన్వెల్త్ గేమ్స్ 2022 ఆగస్టు 8వ తేదీన అంటే ఇవ్వాల్టి (సోమవారం)తో ముగియనున్నాయి. 72 దేశాల క్రీడాకారులు పాల్గొంటున్న  ఈ క్రీడలు ముగింపు దశకు చేరిన తరుణంలో భారత్ పతకాల సంఖ్య కూడా పెరుగుతోంది. భారత్ ఇప్పటి వరకు మొత్తం 18 బంగారు పతకాలు సాధించి పతకాల పట్టికలో టాప్​ 5 ప్లేస్​కి చేరుకుంది. గేమ్స్‌ లో ఇంకా కొన్ని ఈవెంట్‌లు మిగిలి ఉన్నాయి. అందులో భారత్‌ మరిన్ని బంగారు పతకాలు సాధించే అవకాశం ఉంది.

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

- Advertisement -
   

బర్మింగ్‌హామ్‌లో భారత్​ తన సత్తా చాటుతోంది. మునుపెన్నడూ లేని రీతిలో ఈసారి పతకాలను కొల్లగొడుతూ దేశ కీర్తిని చాటుతున్నారు క్రీడాకారులు ఇక.. పతకాల పట్టికలో ఇండియా టాప్​ 5 ప్లేస్​లో నిలిచింది. ఇవ్వాల (సోమవారం) జరిగే ఆటలతో మరిన్ని పసిడి పతకాలు కొల్లగొట్టడం ఖాయమంటున్నారు స్పోర్ట్స్​ అనలిస్టులు. ఇప్పటికే 18 బంగారు, 15 సిల్వర్​, 22 బ్రాంజ్ మొత్తం55 పతకాలతో కామన్వెల్త్ గేమ్స్ పతకాల పట్టికలో భారతదేశం 5వ స్థానంలో ఉంది. ఆగస్ట్ 8 సోమవారం బర్మింగ్‌హామ్‌లో జరిగే క్రీడల చివరి రోజున మరిన్ని పతకాల సాధన దిశగా ఆటగాళ్లు పోరాటం సాగనుంది.. భాతదేశం శుక్ర, శనివారాల్లో అపూర్వమైన పతకాలను సొంతం చేసుకుంది. బర్మింగ్‌హామ్ 2022లో  అత్యధిక పతకాలు సాధించి ఈ ఆటలను గ్రాండ్​గా ముగించాలని క్రీడాకారులు ఆశిస్తున్నారు.

CWG 2022: మెడల్ టేబుల్

సోమవారం ఒక్కరోజే భారత్‌కు 5 బంగారు పతకాలు దక్కే చాన్సెస్​ ఉన్నాయి…

పివి సింధు, లక్ష్య సేన్, సాత్విక్‌సాయిరాజ్, రంకిరెడ్డి స్వర్ణం సాధించడంతో బ్యాడ్మింటన్ ప్రధాన వేదికగా కానుంది. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన సింధు, కెనడాకు చెందిన మిచెల్ లీతో జరిగే ఫైనల్‌లో CWGలో తన తొలి బంగారు పతకాన్ని గెలుచుకోవాలని చూస్తోంది. ఇక యువ లక్ష్యసేన్​, డబుల్స్ జోడీ సాత్విక్,  చిరాగ్ కూడా టాప్ ప్రైజ్‌ని కొల్లగొట్టాలని చూస్తున్నారు.

ఇప్పటికే 3 పతకాలు సాధించిన లెజెండరీ పాడ్లర్, తన 2వ పురుషుల సింగిల్స్ టేబుల్ టెన్నిస్ స్వర్ణాన్ని గెలుచుకోవాలని చూస్తున్నందున అందరి దృష్టి కూడా ఆచంట శరత్ కమల్‌పైనే ఉంది. శరత్ కమల్ తన 13వ CWG పతకాన్ని సాధించాలని గట్టిపట్టుదలతో ఉన్నాడు. అయితే లియామ్ పిచ్‌ఫోర్డ్ పై ఈ సవాలు స్టార్ ప్యాడ్లర్‌కు ఎట్లాంటి మలుపుతిరుగుతుందో చూడాలి అంటున్నారు అనలిస్టులు.

కాగా, ఆస్ట్రేలియాతో భారత పురుషుల హాకీ జట్టు గోల్డ్ మెడల్ మ్యాచ్ ఆ దేశానికి ఆఖరి ఈవెంట్. టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం గెలిచిన మన్‌ప్రీత్ సింగ్ సేన.. CWG  పురుషుల హాకీలో దేశంలోనే తొలిసారిగా స్వర్ణం సాధించాలని చూస్తోంది.

సోమవారం, ఆగస్టు 8 : CWG లో భారతదేశ షెడ్యూల్..

బ్యాడ్మింటన్ – మధ్యాహ్నం 1:20 IST నుండి ప్రారంభమవుతుంది, మహిళల సింగిల్స్ ఫైనల్‌లో పివి సింధు వర్సెస్ మిచెల్ లీ (కెనడా) – మధ్యాహ్నం 1:20 IST

పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో లక్ష్య సేన్ వర్సెస్ ఎన్జీ యోంగ్ (మలేషియా) – మధ్యాహ్నం 2:10 గంటలకు iST

పురుషుల డబుల్స్ ఫైనల్‌లో సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి/చిరాగ్ శెట్టి vs బెన్ లేన్/సీన్ వెండీ (ఇంగ్లండ్) – మధ్యాహ్నం 3 గంటలకు IST

హాకీ – సాయంత్రం 5 గంటల నుండి IST

పురుషుల గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో భారత్ vs ఆస్ట్రేలియా – సాయంత్రం 5 గంటలకు IST

టేబుల్ టెన్నిస్ – మధ్యాహ్నం 3:35 IST నుండి

పురుషుల సింగిల్స్ కాంస్య పతక పోరులో సత్యన్ జి vs పాల్ డ్రింక్‌హాల్ (ఇంగ్లండ్) – మధ్యాహ్నం 3:35 IST

పురుషుల సింగిల్స్ స్వర్ణ పతక పోరులో శరత్ కమల్ vs లియామ్ పిచ్‌ఫోర్డ్ (ఇంగ్లండ్) – సాయంత్రం 4:25 IST

Advertisement

తాజా వార్తలు

Advertisement