Thursday, October 10, 2024

ICC | టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ హవా !

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు దుమ్మురేపారు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో బుమ్రా ఆరు వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో తిరిగి అగ్రస్థానాన్ని సాధించాడు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండో ర్యాంక్‌లో నిలిచాడు. ఇక బౌలింగ్‌లో బుమ్రా, అశ్విన్‌తో పాటు రవీంద్ర జడేజా (6వ ర్యాంక్) టాప్-10లో ఉన్నాడు. బంగ్లాదేశ్ సిరీస్‌లో తుదిజట్టులో చోటు దక్కని కుల్‌దీప్ యాదవ్ 16వ స్థానంలో నిలిచాడు.

ఇక ఈ సిరీస్‌లో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచిన యశస్వీ జైస్వాల్ రెండు స్థానాలు ఎగబాకి బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి చేరాడు. మరోవైపు విరాట్ కోహ్లి ఏకంగా ఆరు స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇక‌ రిషభ్ పంత్ తొమ్మిదో ర్యాంక్‌లో, రోహిత్ శర్మ 15వ ర్యాంక్‌లో, శుభ్‌మన్ గిల్ 16వ ర్యాంక్‌లో నిలిచాడు. బ్యాటింగ్‌లో జో రూట్, కేన్ విలియమ్సన్ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయిన అక్షర్ పటేల్ ఏడో స్థానంలో నిలిచాడు. ఇక టీమ్ ర్యాంకింగ్స్‌లో టీ20, వన్డేల్లో టీమిండియా అగ్రస్థానంలో ఉంది. టెస్టుల్లో రెండో స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో ఆస్ట్రేలియా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement