Friday, March 29, 2024

భారత మహిళా క్రికెటర్, స్మృతి మంధన్నాకు 4వ ర్యాంక్‌.. ఐసీసీ టీ-20 ర్యాంకుల వెల్లడి

ఐసీసీ టీ-20 ర్యాంకుల్లో భారత మహిళా జట్టు క్రీడాకారుల మెరుగైన స్థానాలు లభించాయి. ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాంకులలొ, బౌలర్ల విభాగంలో భారత స్పిన్నర్‌ రాధాయాదవ్‌కు 13వ స్థానం లభించింది. శ్రీలంకతో ఇటీవల జరిగిన టీ-20 సిరీస్‌లో ఆమె అద్బుత ప్రతిభ కనబరచడంతో ర్యాంకుల జాబితాలో మెరుగైన స్థానానికి చేరుకుంది. గత ర్యాంకులతో పోలిస్తే భారత ఎడమచేతి వాటం బౌలర్‌ రాధాయాదవ్‌ ఏడు స్థానాలు మెరుగుపరుచుకోవడం విశేషం. శ్రీలంక సిరీస్‌లో ఆమె నాలుగు వికెట్లు సాధించారు. శ్రీలంకపై 2-1 తేడాతో భారత్‌ సిరీస్‌ కైవసం చేసుకోవడంలో ఆమె కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

కాగా బ్యాటింగ్‌ విభాగంలో స్మృతి మంధన్నాకు నాలుగో ర్యాంకు, జెమిమా రోడ్రిగ్స్‌ 14వ ర్యాంకు, హర్మన్‌ప్రీత్‌ గౌర్‌కు 18వ ర్యాంకులను నిలుపుకున్నారు. ఇక శ్రీలంక జట్టు కెప్టెన్‌ చామరి ఆటపట్టు ఒక స్థానాన్ని మెరుగుపరుచుకున్న ఏడో స్థానంలో నిలిచారు. బ్యాటింగ్‌లో ఆమె అద్భుత ప్రదర్శన (మూడు మ్యాచ్‌లలో 139 పరుగులు) చేయడంతో ఆమె స్థానం మెరుగుపడింది. ఆల్‌రౌండర్ల ర్యాంకుల జాబితాలో కూడా ఆమె రెండు స్థానాలను మెరుగుపరుచుకుంది. ఇక మరో భారత మహిళా క్రికెటర్‌ పూజా వస్త్రాకర్‌ 32వ స్థానం నుంచి రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 30వ ర్యాంకును పొందింది. ఇక మరో క్రికెటర్‌ రేణుక ఠాకూర్‌ గతంలో 97వ ర్యాంకు సాధించగా, ఇప్పుడు 83 వ ర్యాంకుతో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement