Monday, April 15, 2024

కామన్వెల్త్‌ గేమ్స్ కు భార‌త్ హాకీ టీం రెడీ

కామన్వెల్త్‌ గేమ్స్‌కు భారత హాకీ టీమ్‌ను ఎంపిక చేసినట్లు చీఫ్‌ కోచ్‌ గ్రాహమ్‌ రైడ్‌ తెలిపారు. కెప్టెన్‌గా మన్‌ప్రీత్‌ సింగ్‌, వైస్‌ కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ను ఎంపిక చేశారు. జులై 29 నుంచి బర్మింగ్‌హామ్‌ వేదికగా కామన్వెల్త్‌ గేమ్స్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. భారత హాకీ జట్టు పూల్‌-బీలో ఉంది. జులై 31న ఘనాతో టీమిండియా తలపడనుంది. అనంతరం ఇంగ్లండ్‌, కెనడా, వేల్స్‌ జట్లతో భారత జట్టు ఆడనుంది. మన్‌ప్రీత్‌ సింగ్‌ నేతృత్వంలో 2020 టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. రజత పతకం సాధించిన నాలుగు దశాబ్దాల తర్వాత టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరిచింది.

అదే ఊపు బర్మింగ్‌హామ్‌లో జరుగనున్న కామన్వెల్త్‌ గేమ్స్‌లో కొనసాగిస్తారని హాకీ క్రీడాభిమానులు ఎదురుచూస్తున్నారు. టీమిండియా హాకీ బృందంలో ఎవరెవరు ఉన్నారంటే… గోల్‌ కీపర్లు పీఆర్‌ శ్రీజేష్‌, కిషన్‌ బహదూర్‌ పతక్‌, డిఫెండర్స్‌ వరుణ్‌కుమార్‌, సురేందర్‌ కుమార్‌, హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, అమిత్‌ రోహిదాస్‌, జుగ్‌రాజ్‌ సింగ్‌, జర్మన్‌ప్రీత్‌ సింగ్‌, మిడ్‌ఫీల్డర్స్‌ మణ్‌ప్రీత్‌ సింగ్‌, హార్దిక్‌ సింగ్‌, వివేక్‌ సాగర్‌ ప్రసాద్‌, షంషీర్‌ సింగ్‌, అక్షదీప్‌ సింగ్‌, నీలకంఠ శర్మ, ఫార్వార్డ్స్‌ మన్‌దీప్‌ సింగ్‌, గుర్జంత్‌ సింగ్‌, లలిత్‌ కుమార్‌ ఉపాధ్యాయ, అభిషేక్‌లు ఉన్నారు..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement