Friday, November 1, 2024

Duleep Trophy | ఇండియా డి ఆలౌట్.. ఆక‌ట్టుకున్న అక్షర్

ప్రతిష్టాత్మకమైన దేశవాళీ టోర్నమెంట్ దులీప్ ట్రోఫీలో, ఇండియా డిని 164/10 కే క‌ట్ట‌డి చేసిన‌ ఇండియా సి… 91/4 పరుగులు సాధించి, 73 పరుగుల వెనుకబడి ఉంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా డి… ఇండియా సి బౌలర్లు నిప్పులు చెరిగారు. దీంతో ఇండియా డి జ‌ట్టు 48 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ అసాధారణ బ్యాటింగ్ తో చెలరేగాడు. వరుసగా బౌండరీలు బాది 86 పరుగులు చేసి జట్టుకు 164 పరుగుల స్కోరు అందించాడు.

ఇండియా డీలో అక్షర్ పటేల్ (83) మినహా అథర్వ టైడ్(4), యశ్ దుబే(10), శ్రేయస్ అయ్యర్(9), దేవదత్ పడిక్కల్(0), రికీ భుయ్(4), శ్రీకర్ భరత్(13), సరన్ష్ జైన్(13), హర్షిత్ రాణా(0), అర్ష్‌దీప్ సింగ్(13) దారుణంగా విఫలమయ్యారు. ఇండియా సీ బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాఖ్(3/19) మూడు వికెట్లు తీయగా.. అన్షుల్ కంబోజ్(2/47), హిమన్షఉ చౌహన్(2/22) రెండేసి వికెట్లు పడగొట్టారు. మానవ్ సుతార్, హృతిక్ షోకీన్ తలో వికెట్ తీసారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా సీ 91 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(5), సాయి సుదర్శన్(7), ఆర్యన్ జుయల్(12) దారుణంగా రజత్ పటీదార్(13) విఫలమవ్వగా.. బాబా ఇంద్రజిత్(15 బ్యాటింగ్), అభిషేక్ పోరెల్ (32 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇండియా డీ బౌలర్లలో హర్షిత్ రాణా, అక్షర్ పటేల్ రెండేసి వికెట్ పడగొట్టాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement