Friday, November 8, 2024

IND vs BAN | భార‌త్ జోష్‌.. ఆల్​రౌండ్ షోతో రికార్డ్​ విక్టరీ

బంగ్లాపై భారత్‌ ఘన విజయం సాధించింది. ఉప్పల్‌ వేదికగా శ‌నివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ప్రత్యర్థిని 133 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించింది. చివరి టీ20లోనూ విజయఢంకా మోగించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్లకు 297 పరుగుల భారీ స్కోర్ చేసింది. 298 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో బంగ్లా బోల్తా కొట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 164 పరుగులకు పరిమితమైంది. లిటన్‌దాస్‌ (42), హిర్దోయ్‌ (63*) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ మూడు వికెట్లు తీయగా.. మయాంక్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి తలో వికెట్ తీసారు.

- Advertisement -

అంత‌క‌ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా…. సంజూ శాంసన్(47 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్‌లతో 111) విధ్వంసకర సెంచరీతో చెలరేగగా.. సూర్యకుమార్ యాదవ్(35 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 75) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. చివర్లో రియాన్ పరాగ్( 13 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 34), హార్దిక్ పాండ్యా(18 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 47) మెరుపులు మెరిపించారు. కాగా, ఈ మ్యాచ్ లో సెంచ‌రీతో స‌త్తా చాటిన సంజూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. మ్యాన్ ఆఫ్ ది సిర‌స్ ఆవార్డును హార్డిక్ పాండ్యా ద‌క్కించుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement