Saturday, December 2, 2023

ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీలో.. త‌మ‌న్నా డ్యాన్స్

ఎప్ప‌టిలాగానే ఐపీఎల్ టోర్నీని ప్రారంభించేందుకు ఘ‌నంగా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగే ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీలో మిల్కీ బ్యూటీ తమన్నా డాన్స్ పెర్ఫార్మెన్స్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. మార్చి 31న సాయంత్రం 6 గంటలకు ఐపీఎల్ ప్రారంభ వేడుకలు మొదలవుతాయి. ఈ ఈవెంట్ లో తమన్నాదే తొలి ప్రదర్శన కానుంది. కాగా, ఓపెనింగ్ సెర్మనీలో పాల్గొనే ఇతర స్టార్ల వివరాలను కూడా ఐపీఎల్ వెల్లడించనుంది. ఐపీఎల్-16 ప్రారంభ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్స్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తాజా సీజన్ వచ్చేస్తోంది. మార్చి 31న ఐపీఎల్-16 ప్రారంభం కానుంది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement