Thursday, April 25, 2024

Breaking: టీ20 వరల్డ్​ కప్​ మ్యాచ్​లు ప్రారంభం.. ఫస్ట్​ మ్యాచ్​లో తలపడుతున్న శ్రీలంక, నమీబియా

టీ20 వరల్డ్​ కప్​ ఎనిమిదో ఎడిషన్ ఆస్ట్రేలియాలోని గీలాంగ్‌లో ఇవ్వాల (ఆదివారం) ప్రారంభం అయ్యంది. ఆసియా కప్ విజేత శ్రీలంక, తమ చివరి ఐదు టీ20 మ్యాచ్‌లను గెలిచి మంచి ఫామ్‌లో ఉంది. ఇవ్వాల జరిగే తొలి మ్యాచ్​ లో టాస్ గెలిచి ముందుగా నమీబియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కాగా, నమీబియా 3 ఓవర్లలోనే 17 పరుగులు మాత్రమే చేసి రెండు కీలక వికెట్లను పోగొట్టుకుంది.

ఇక.. పిచ్ కఠినంగా ఉందని, దానిపై కొద్దిగా గడ్డి కూడా ఉండడంతో బౌలింగ్​కు ఉపకరిస్తుందని లంక ఆటగాళ్లు భావించి తొలుత బౌలింగ్​ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక.. 3 ఓవర్ల వరకు చమేరా,  మధుశాన్​ తలో వికెట్​ తీసుకున్నారు.

శ్రీలంక ప్లేయింగ్ XI: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (కీపర్), ధనంజయ డి సిల్వా, దనుష్క గుణతిలక, భానుక రాజపక్ష, దసున్ షనక (సి), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, ప్రమోద్ లియానగమగే, మహేశ్ తీక్షణ

నమీబియా ప్లేయింగ్ XI: దివాన్ లా కాక్, మైకేల్ వాన్ లింగేన్, స్టీఫన్ బార్డ్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, గెరార్డ్ ఎరాస్మస్ (సి), జాన్ ఫ్రైలింక్, JJ స్మిత్, డేవిడ్ వైస్, జేన్ గ్రీన్ (కీపర్), బెర్నార్డ్ స్కోల్ట్జ్, బెన్ షికోంగో

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement