Thursday, April 25, 2024

ధోనికి నేను ఎప్పుడూ రైట్ హ్యాండ్ నే.. కోహ్లీ

ఎంఎస్ ధోనీకి తానెప్పుడూ రైట్ హ్యాడ్ న‌ని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. తనకు కెప్టెన్సీని ధోనీ ఎలా బదలాయించాడో వివరించాడు. ధోనీతో 2008 నుంచి 2019 వరకు డ్రెస్సింగ్ రూమ్ ను కోహ్లీ పంచుకున్నాడు. కోహ్లీ నాయకత్వ లక్షణాలను పసిగట్టిన ధోనీ, ముందు నుంచే అతడికి తగిన మెలకువలు నేర్పి తదుపరి కెప్టెన్ గా అతడిని ప్రతిపాదించడం గమనార్హం. ఆర్సిబీ పాడ్ కాస్ట్ సీజన్ 2లో భాగంగా కోహ్లీ ఈ విషయాలను తెలిపాడు. 2012లోనే ధోనీ తన చేయి కిందకు తనను తీసుకున్నట్టు చెప్పాడు..మైదానంలో నేను ధోనీకి కుడి భుజం వంటివాడిని.

ఆటలో ఏం చేయాలో ఇద్దరం కలసి చర్చించుకునే వాళ్లం. నాకు, ఎంఎస్ కు మధ్య ఆ సమయంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. నేను అతడికి వైస్ కెప్టెన్ గా ఉన్నాను. మైదానంలో ఏం చేయాలనే విషయమై తరచూ అతడితో మాట్లాడేవాడిన‌ని చెప్పాడు కోహ్లీ. తాను కేవలం చూస్తూ ఉండకుండా ఫీల్డ్ కు సంబంధించి ఎంతో సమాచారం ఇచ్చేవాడినన్నాడు. పిచ్ ఎలా ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి, పార్ట్ నర్ షిప్ బ్రేక్ చేయడానికి ఏం చేయవచ్చు, తదితర విషయాలు ధోనీతో చర్చించేవాడినన్నారు. ఎంఎస్ పట్ల ఎప్పుడూ దురుద్దేశాలు ఉండేవి కావు. అతను అంటే ఎల్లప్పుడూ ఎంతో గౌరవం ఉండేది. భారత క్రికెట్ కు ఎలా సారథి అయ్యాడు. అంత సుదీర్ఘకాలం పాటు ఎలా రాణించలిగాడో నాకు తెలుసు. నా పట్ల అతడికి ఎంతో నమ్మకం ఉంది. నేను అతని వద్దకు వెళ్లి దేని గురించి అయినా మాట్లాడేవాడిన‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement