Friday, March 29, 2024

Cricket: రెండో టీ 20లో భువీపైనే ఆశలు.. నేడు న్యూజిలాండ్‌తో భారత్‌ ఢీ

కివీస్‌తో మూడు టీ 20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ వర్షార్పణం అయిన నేపథ్యంలో రెండో టీ 20 మీద గంపెడాశలతో భారత్‌ ఎదురు చూస్తుంది. ఆదివారం మౌంట్‌ మాంగనుయ్‌ వేదికగా మ్యాచ్‌ జరగనుంది. ప్రస్తుతం న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్న భారత్‌ వద్ద ఉన్న బౌలర్లలో భువనేశ్వర్‌ కీలక ఆటగాడు. పొట్టి ఫార్మెట్‌లో యువకులకు ప్రాధాన్యత నివ్వాలని ఇప్పటికే నిర్ణయం తీసుకోవడంతో భువనేశ్వర్‌ కుమార్‌ మీద అందరి చూపు పడింది. ఇంతకు జరిగిన మ్యాచ్‌లలో డెత్‌ ఓవర్లలో భువీ ప్రదర్శన పేలవంగా ఉంది. భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.

అరుదైన రికార్డు
టీ 20 ఫార్మెట్‌లో భువనేశ్వర్‌ కుమార్‌ మరో అరుదైన రికార్డును అందుకోబోతున్నాడు. 33 ఏళ్ల భువనేశ్వర్‌ కుమార్‌ ప్రస్తుత సంవత్సరంలో 30 టీ 20లు ఆడాడు. ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో 40 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించేందుకు మరో నాలుగు అడుగుల దూరంలో ఉన్నాడు.

వెల్లింగ్టన్‌ మైదానం మాదిరిగా మౌంట్‌ మాంగనూయ్‌ స్టేడియం చిన్నది కాదు. బౌండరీలు కాస్తా పెద్దగానే ఉంటాయి కాబట్టి స్వింగ్‌ బౌలర్‌ భువీ తన అనుభవంతో రాణించే అవకాశం ఉంది. డెత్‌ ఓవర్లలో చాలా సార్లు తేలిపోవడంతో ఈ సారి భువీని పవర్‌ ప్లేలో వినియోగించుకుంటే మంచిదనే అభిప్రాయం నెలకొంది. టీ 20 తాత్కాలిక కెప్టెన్‌ హర్థిక్‌ పాండ్యా ఆ దిశగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రస్తుతం ఐర్లాండ్‌ బౌలర్‌ జెబీ లిటిల్‌ (39) టాప్‌ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. అతడు 26 మ్యాచుల్లో
39 వికెట్లు తీశాడు.
ఇటీవలె ముగిసిన టీ 20 ప్రపంచకప్‌ సెమీస్‌లో భువీ పెద్దగా రాణించలేదు. అయితే అతనికున్న ప్రతిభాపాటవాలను వెలికి తీయడానికి రెండో టీ 20 చక్కటి అవకాశంగా వినియోగించుకోవాలని హర్థిక్‌ పాండ్యా యోచిస్తున్నాడు.

- Advertisement -

పౌహిరి సంప్రదాయంలో స్వాగతం
న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న హార్థిక్‌ పాండ్యా నేతృత్వంలోని భారత జట్టుకు మౌంట్‌ మౌంగనూయిలో గ్రాండ్‌గా స్వాగతం ల భించింది. సంప్రదాయ పౌహిరి రీతిలో భారత ఆటగాళ్లకు స్వాగతం పలికారు. పౌహిరి వెల్కమ్‌ సెర్మనీలో ప్రసంగాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, గానం ఉంటాయి. అతిథులను ఆహ్వానించే సమయంలో స్థానికంగా ఈ పద్దతిలో స్వాగతం పలుకుతారు. అయితే పాండ్యా బృందానికి కూడా స్వాగతం దక్కడం గమనార్హం.

న్యూజిలాండ్‌ పర్యటన భారత జట్టులోని యువ ఆటగాళ్లకు మంచి అవకాశమని ఈ సిరీస్‌లో ఈ సిరీస్‌లో టీమిండియా టీ 20 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న హార్థిక్‌ పాండ్యా వ్యాఖ్యానించాడు. యువ ఆటగాళ్లు తమ ప్రతిభను చాటుకోవడానికి, తాము ఏ పొజిషన్‌ తో సెట్‌ అవుతామో అనే విషయంలో క్లారిటీ తెచ్చుకోవడానికి ఈ టోర్నీ చక్కగా ఉపయోగపడుతుందని చెప్పాడు.
ఈ టోర్నీకి సీనియర్‌ ప్లేయర్లందరికీ విశ్రాంతి నిచ్చారు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, కెఎల్‌ రాహుల్‌ లాంటి హేమా హేమీల గైర్హాజరీలో న్యూజిలాండ్‌లో భారత్‌ టీ 20, వన్డే సిరీస్‌లు ఆడుతున్నది. టీ జట్టుకు హార్థిక్‌ పాండ్యా, వన్డే జట్టుకు శిఖర్‌ ధవన్‌ కెప్టెన్‌లుగా వ్యవహరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement