Friday, March 29, 2024

హిట్‌ మ్యాన్‌ న్యూ లుక్.. నెట్టింట్లో తెగ వైరల్..

గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ బెంగళూరులోని ఎన్‌సీఏ అకాడమీలో కోలుకుంటున్నాడు. హిట్‌మ్యాన్‌ తాజాగా తన ఇన్‌స్టాలో పోస్టు చేసిన ఫొటో తెగ వైరల్‌ అవుతున్నది. సరికొత్త లుక్‌తో కనిపిస్తున్నాడు. క్లీన్‌ షేవ్‌ చేసుకున్న రోహిత్‌.. మీసాలు పూర్తిగా తీసేశాడు.

ఆకుపచ్చ రంగు టీషర్టు, నలుపు రంగు టోపీ ధరించి ఫ్రెష్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఎన్‌సీఏలో బరువు తగ్గించేందుకు కృషి చేస్తున్న హిట్‌ మ్యాన్‌ సానుకూల ఫలితం సాధించినట్టు ఈ ఫొటోలో తెలుస్తున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement