Thursday, November 7, 2024

Asian Table Tennis | పురుషుల జ‌ట్టుకు హ్యాట్రిక్‌ కాంస్యం

ఆసియా టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు హ్యాట్రిక్‌ కాంస్య పతకం గెలుచుకుంది. ఆసియా పోటీల్లో గత రెండు ఏడిషన్స్‌ (2021, 2023)లలో బ్రౌన్జ్‌ మెడల్స్‌ సాధించిన పురుషుల జట్టు తాజాగా 2024లోనూ కాంస్య పతకాన్ని దక్కించుకుంది.

గురువారం జరిగిన సెమీస్‌లో భారత్‌ 0-3 తేడాతో చైనీస్‌ తైపి చేతిలో ఓటమిపాలై కాంస్యతో సరిపెట్టుకుంది. క్వార్టర్‌ వరకు అద్భుతంగా పోరాడిన భారత జట్టు సెమీస్‌లో మాత్రం మరోసారి తడబడింది. తొలి మ్యాచ్‌లో భారత స్టార్‌ శరత్‌ కమల్‌ 0-3 (7-11, 10-12, 9-11) తేడాతో లిన్‌ యున్‌ జు చేతిలో చిత్తుగా ఓడిపోయాడు.

తర్వాత రెండో మ్యాచ్‌లో మానవ్‌ టక్కర్‌ 1-3 (9-11, 11-8, 3-11, 11-13)తో కావ్‌ చెంగ్‌-జుయ్‌ చేతిలో పోరాడి ఓడగా.. మూడో మ్యాచ్‌లో హర్మీత్‌ దేశాయ్‌ 0-3 (6-11, 9-11, 7-11)తో హువాంగ్‌ యన్‌ చెంగ్‌ చేతిలో పరాజయం చవిచూశాడు. కాగా, అంతకుముందు భారత మహిళల జట్టు కూడా సెమీస్‌లో ఓడి తొలిసారి కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement