ప్రతిష్టాత్మక ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో డ్రాల పర్వానికి తెరపడింది. వరుసగా ఏడు డ్రా గేమ్‌ల తర్వాత ఫలితం దక్కింది. ఈరోజు జరిగిన 11వ రౌండ్‌లో భారత యువ సంచలనం దొమ్మరాజు గుకేష్ డిఫెండింగ్ ఛాంపియన్, చైనీస్ చెస్ గ్రాండ్ మాస్టర్ డింగ్ లిరెన్ పై విజయం సాధించాడు.
ఇంకా మూడు రౌండ్లు మాత్రమే మిగిలి ఉన్న ఈ ప్రపంచ మ్యాచ్‌లో గుకేశ్ 6 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్నాడు. లిరెన్ 5 పాయింట్లతో ఉన్నాడు.
కాగా, 14 రౌండ్లు ఉండే ఈ ప్రపంచ మ్యాచ్‌లో తొలుత 7.5 పాయింట్లు సాధించిన ఆటగాడు విజేతగా నిలుస్తాడు. తొలి మ్యాచ్‌లో లిరెన్ విజయం సాధించగా.. రెండో గేమ్ డ్రాగా ముగిసింది. గుకేశ్ మూడో గేమ్‌లో గెలుపొంది లిరెన్‌ను సమం చేశాడు. తర్వాత జరిగిన ఏడు గేమ్‌లు హోరాహోరీగా సాగినా చివరకు డ్రాగా ముగిశాయి. 11వ గేమ్‌లో ఫలితం తేలడంతో డ్రాల పర్వానికి తెరపడింది.