Wednesday, April 24, 2024

Breaking: దీటుగా ఆడుతున్న గుజ‌రాత్‌.. 16 ఓవ‌ర్ల‌కు 146/3

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో జ‌రుగుతున్న‌ ప్లేఆఫ్స్ మ్యాచ్‌లో గుజరాత్ జట్టుకు అద్భుతమైన ఆరంభం దక్కింది. వృద్ధిమాన్‌ సాహా (0) నిరాశపరిచినా.. ఆ తర్వాత వచ్చిన మాథ్యూ వేడ్ (35) ధాటిగా ఆడాడు. అతనితోపాటు మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (35) కూడా ధనాధన్ షాట్లు ఆడాడు. దాంతో గుజరాత్ కాస్త ప‌టిష్ట‌మైన స్కోరు దిశ‌గా ప‌రుగులు తీస్తోంది.

ఇక ..ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (35) అనవసర పరుగు కోసం ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. అశ్విన్ వేసిన 8వ ఓవర్ నాలుగో బంతిని లాంగాన్ వైపు కొట్టిన గిల్.. రెండు పరుగుల కోసం ప్రయత్నించాడు. అయితే బంతి అంత దూరం వెళ్లకపోవడం, ఫీల్డర్ వేగంగా బంతిని చేరుకోవడం చూసిన మాథ్యూ వేడ్ రెండో పరుగు కోసం రాలేదు. అయితే రెండో పరుగు తీయాలనే ఉద్దేశంతో సగం పిచ్ వరకూ వచ్చేసిన గిల్ సరైన సమయంలో వెనుతిరగలేకపోయాడు. దాంతో నిరాశగా పెవిలియన్ చేరాడు. దీంతో 72 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.

16 ఓవ‌ర్ల వ‌ద్ద గుజ‌రాత్ ఓవ‌రాల్ స్కోరు 145 ప‌రుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది. ఈ స‌మ‌యంలో హార్దిక్ పాండ్య‌, డేవిడ్ మిల్ల‌ర్ ఆడుతున్నారు. ఈ స‌మ‌యానికి 24 బంతుల్లో 43 ప‌రుగులు చేయాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement