Wednesday, March 27, 2024

మాక్స్‌వెల్‌ అదరహో..

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ తన తొలి ప్రాక్టీస్‌ సెషన్‌లో ఇరగదీశాడు. ఇటీవలే క్వారంటైన్‌ పూర్తి చేసుకున్న మ్యాక్సీ.. మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్‌ 2021 సీజన్‌ నేపథ్యంలో సాధన మొదలుపెట్టాడు. మాక్సీని బెంగళూరు రూ.14.25కోట్లకు కొనుగోలు చేసింది.తొలి ప్రాక్టీస్‌ సెషన్‌లో సూపర్‌ టచ్‌లో ఉన్నట్టు కనిపించిన మాక్సీ.. రివర్స్‌ స్వీప్‌ షాట్లతో అలరించాడు. పేసర్లు, స్పిన్నర్లు అన్న తేడా లేకుండా ఎడాపెడా వాయించేశాడు.అలవోకగా భారీ సిక్సర్లు బాదేశాడు. స్పిన్నర్‌ చహల్‌ వేసిన బంతిని రివర్స్‌ స్వీప్‌ షాట్‌ ఆడుతూ భారీ సిక్సర్‌గా మలచడం హైలైట్‌గా నిలిచింది. అలాగే ఆసీస్‌ ఆల్‌రౌండర్‌, సహచర క్రికెటర్‌ డేనియల్‌ క్రిస్టియన్‌ వేసిన బంతిని కూడా మ్యాక్సీ..అద్భుతమైన రివర్స్‌ స్కూప్‌ షాట్‌ ఆడాడు. అతని బ్యాటింగ్‌ విన్యాసాలకు సంబంధించిన వీడియోను ఆర్‌సీబీ ట్విటర్లో పోస్ట్‌ చేయగా నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement