Thursday, March 28, 2024

లార్డ్స్‌లో గంగూలీ రికార్డును బ‌ద్ద‌లుకొట్టిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మ‌న్‌

ఇండియన్ టీమ్ మాజీ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీ పేరిట 25 ఏళ్లుగా ఉన్న ఓ అరుదైన రికార్డు ఇప్పుడు క‌నుమ‌రుగైంది. ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మ‌న్ డెవోన్ కాన్వే ఈ కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. లార్డ్స్‌లో టెస్ట్ అరంగేట్రంలోనే అత్య‌ధిక ప‌రుగులు చేసిన రికార్డును గంగూలీ క్రియేట్ చేశాడు. అయితే తాజాగా కాన్వే మాత్రం ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్ తొలి రోజే 136 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచి గంగూలీ రికార్డును బ్రేక్ చేశాడు. 

క్రికెట్ మ‌క్కాగా భావించే లార్డ్స్‌లో టెస్ట్ అరంగేట్రం చేయ‌డ‌మే కాకుండా సెంచ‌రీ బాదిన ఆరో బ్యాట్స్‌మ‌న్‌గా కాన్వే నిలిచాడు. ఈ క్ర‌మంలో గంగూలీ రికార్డును అధిగ‌మించాడు. గంగూలీ 1996లో ఇదే లార్డ్స్‌లో టెస్ట్ అరంగేట్రం చేసి 131 ప‌రుగులు చేశాడు. మ‌రో విశేషం ఏమిటంటే గంగూలీ, కాన్వే ఇద్ద‌రూ జులై 8నే త‌మ‌ పుట్టిన‌రోజు జరుపుకుంటారు. అంతేకాదు లార్డ్స్‌లో అరంగేట్ర టెస్ట్‌లోనే సెంచ‌రీ చేసిన మూడో విదేశీ బ్యాట్స్‌మ‌న్ కాన్వే. గ‌తంలో గంగూలీతోపాటు 1893లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మ‌న్ హ్యారీ గ్రాహం కూడా 107 ప‌రుగులు చేశాడు. బుధ‌వారం కాన్వే సెంచ‌రీతో తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి న్యూజిలాండ్ 3 వికెట్ల‌కు 246 ప‌రుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement