Tuesday, April 16, 2024

Formula e–Race | ఫార్ములా ఈ–రేస్​ ప్రారంభ కార్యక్రమానికి రావాలి.. ఎఫ్​ఐఏ చీఫ్ సులేయంకు ఆహ్వానం​

హైదరాబాద్​లో ప్రతిష్టాత్మంగా జరిగే ఫార్ములా ఇ–రేస్ ప్రారంభ కార్యక్రమానికి హాజరు కావాలని FIA ప్రపంచ పాలక సంస్థ అధ్యక్షుడిగా ఉన్న మొహమ్మద్​ బిన్​ సులేయంని ఆహ్వానించారు. ఫార్ములా ఈ–రేస్​ ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో జరగనుంది. కాగా, 2021 డిసెంబర్ లో జీన్ టోడ్ నుండి FIA పగ్గాలు చేపట్టారు బిన్ సులేయం. ఆల్-ఎలక్ట్రిక్ సిరీస్ రేసుకు భారతదేశంతోపాటు ఇతర దేశాల్లోనూ జరిగే కార్యక్రమాలకు ఇతర ప్రముఖులతో కలిసి సులేయం హాజరవుతారని భావిస్తున్నారు.

రేసు నిర్వాహకులుగా – గ్రీన్‌కో, తెలంగాణ ప్రభుత్వం 2.83 కి.మీ పొడవు గల స్ట్రీట్ సర్క్యూట్‌ను సిద్ధం చేస్తున్నాయి. అయితే.. ఇప్పటికైతే చాలా మౌలిక సదుపాయాలు తాత్కాలికంగానే చేపట్టారు. ట్రాక్ చుట్టూ శాశ్వత నిర్మాణం ఉండే టీమ్ గ్యారేజీలకు మాత్రం తుది మెరుగులు దిద్దుతున్నారు. ఫార్ములా E అనేది 2013లో ఫార్ములా 1 ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ తర్వాత దేశంలో జరుగుతున్న మొదటి FIA ప్రపంచ ఛాంపియన్‌షిప్-స్టేటస్ ఈవెంట్. అంతేకాకుండా టూ-వీల్ రేసింగ్‌కు పరాకాష్టగా పేరొందిన MotoGP సెప్టెంబర్‌లో దేశంలో తన మొదటి రౌండ్‌ను నిర్వహించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement