Thursday, April 25, 2024

ఆర్చర్ కు గాయం..న్యూజిలాండ్‌తో సిరీస్‌కు దూరం

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఇంగ్లాండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ దూరమయ్యాడు. మోచేతి గాయం తిరగబెట్టడంతో వచ్చే నెలలో న్యూజిలాండ్‌తో జరిగే రెండు టెస్టులకు అతడు అందుబాటులో ఉండడని ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు తెలిపింది. ఇంగ్లాండ్‌, ససెక్స్‌ సీమర్‌ జోఫ్రా ఆర్చర్‌ వచ్చే నెల న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌ నుంచి తప్పుకున్నాడని ఇంగ్లాండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. బౌలింగ్‌ చేసేటప్పుడు తన కుడి మోచేయి నొప్పితో బాధపడ్డాడు. మ్యాచ్‌ చివరి రెండు రోజులలో బౌలింగ్‌ చేయలేకపోయాడని వివరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement