Tuesday, April 16, 2024

Breaking: బౌలింగ్​, బ్యాటింగ్​లో రాణించిన ఢిల్లీ.. రాజస్థాన్​పై ఘన విజయం

రాజస్థాన్​ రాయల్స్త తో జరిగిన మ్యాచ్​లో ఢిల్లీ​ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో  ఢిల్లీ బౌలర్లు సమష్టిగా రాణించి తక్కువ పరుగులకే రాజస్థాన్​ని కట్టడి చేశారు. కాగా, సెకండ్​ ఇన్నింగ్స్​లో బ్యాటింగ్​ చేసినఢిల్లీ టీమ్​ కూడా దీటుగానే ఆడింది. 17 ఓవర్ల వద్ద 144 పరుగుల మైలు రాయిని చేరుకున్నారు కుర్రాళ్లు.. ఒక వికెట్​ కోల్పోయి మాంచి దూకుడు మీదున్నారు. అయితే.. 18వ ఓవర్లో తొలి బంతికే​ సెకండ్​ వికెట్​ కోల్పోయింది ఢిల్లీ.. 89 వ్యక్తిగత స్కోరు వద్ద మిశ్చెల్​ మార్ష్​ అవుటయ్యాడు. దీంతో మ్యాచ్​ కాస్త టఫ్​గా మారింది. అప్పటికి 16 బంతుల్లో 16 పరుగులు చేయాల్సి ఉంది.. ఈ టైమ్​లో డేవిడ్​ వార్నర్​ సిక్స్​ బాదడంతో స్కోరు బోర్డు కాస్త స్పీడందుకుంది. ఇక 14 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేయాల్సి ఉండగా.. కెప్టెన్​ అండ్​ కీపర్​ రిషబ్​ పంత్​ తన వంతు ఆటగా.. మ్యాచ్​ని ఫినిష్​ చేశాడు..

కాగా, తొలుత బ్యాటింగ్​కు దిగిన రాజస్థాన్​ బ్యాట్స్​మన్​ని ఢిల్లీ బౌలర్లు ఆడకుండా అడ్డుకోవడంలో సక్సెస్​ అయ్యారు. దీంతో ఆర్ఆర్ బ్యాట్స్​మన్​ పూర్తిగా సత్తా చాటలేకపోయారు. సూపర్ ఫామ్‌లో ఉన్న జోస్ బట్లర్ (7)ను యువ బౌలర్ చేతన్ సకారియా మూడో ఓవర్లోనే పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కాసేపు వికెట్ పడకుండా అశ్విన్ (50), జైస్వాల్ (19) జట్టును ఆదుకున్నారు. కానీ 9వ ఓవర్లో జైస్వాల్ కూడా పెవిలియన్ చేరాడు.

ఇలాంటి సమయంలో అశ్విన్‌కు జత కలిసిన దేవదత్ పడిక్కల్ (48) చక్కని ఇన్నింగ్స్ ఆడాడు. వీళ్లిద్దరూ చూడచక్కని షాట్లతో అలరించారు. అర్ధశతకం పూర్తయిన వెంటనే మిచెల్ మార్ష్ బౌలింగ్‌ల్ అశ్విన్ అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సంజూ శాంసన్ (6), రియాన్ పరాగ్ (9) నిరాశ పరిచారు. అంచనాలు పెట్టుకున్న రాసీ వాన్ డర్ డస్సెన్ (12 నాటౌట్) భారీ షాట్లు ఆడలేకపోయాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ జట్టు 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేసింది. ఢిల్లీ బౌలర్లలో నోర్ట్‌జీ, సకారియా, మిచెల్ మార్ష్ తలో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement