Friday, April 19, 2024

57 ప‌రుగులు చేసి ఔటైన డెవిడ్ వార్న‌ర్ – ఢిల్లీ క్యాపిట‌ల్స్ 93/4

ఢిల్లీ – 128 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ 94 ప‌రుగుల‌కు నాలుగు వికెట్లు పోగొట్టుకుంది. కెప్టెన్ డెవిడ్ వార్న‌ర్ 57 పరుగులు చేసి వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి బౌలింగ్ లో పెవిలియ‌న్ కు చేరారు.. అంత‌కు ముందు 3పరుగులు చేసిన ఫిల్ సేత్ ను రాయ్ అవుట్ చేశాడు..ఇక. కెకెఆర్ కెప్టెన్ నితీష్ రానా తొలిసారిగా బౌలింగ్ చేసి హార్డ్ హిట్ట‌ర్ మిచ్చెల్ మార్ష్ ను 2 ప‌రుగుల‌కే ఔట్ చేశాడు.. ముందుగా 34 ప‌రుగుల వ‌ద్ద తొలివికెట్ పోగొట్టుకుంది.. ఓపెన‌ర్ పృథ్వీ షా మ‌రోసారి విఫ‌లమ‌య్యాడు.. 13 ప‌రుగులు చేసిన షాని వ‌ర‌ణ్ చ‌క్ర‌వ‌ర్తి పెవిలియ‌న్ కు చేర్చాడు.. 14 ఓవ‌ర్లు ముగిసే నాటికి డిసి నాలుగు వికెట్ల న‌ష్టానికి 93 ప‌రుగులు చేసింది. కాగా, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది.. బౌలింగ్ కు దిగిన డిసి వరుసగా వికెట్లు తీసి కెకెఆర్ ని ప‌రుగుల‌కే కట్టడి చేసింది.. దీంతో డిసి విజ‌యం సాధించాలంటే ప‌రుగులు చేయాల్సి ఉంది.. ముందుగా బ్యాటింగ్ కు దిగిన కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ వ‌రుస‌గా వికెట్లు పోగొట్టుకుంటూనే ఉంది… ఒక్క జెసన్ రాయ్ మినహ ఏ ఒక్క బ్యాట‌ర్ క్రీజ్ లో నిల‌దొక్కుకోలేక‌పోయారు.. ర‌స్సెల్ చివ‌రిలో ధ‌నాధ‌న్ బ్యాటింగ్ చేశాడు.. చివ‌రి ఓవ‌ర్ లో వ‌రుస‌గా మూడు సిక్స్ లు సాధించాడు.. ర‌స్సెల్ 38 ప‌రుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు.. చివ‌రి వికెట్ గా వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి ర‌నౌట్ గా వెను తిరిగాడు. నిల‌క‌డ‌గా ఆడిన‌ జేస‌న్ రాయ్ 43 ప‌రుగులు చేసి కుల‌దీప్ బౌలింగ్ లో ఏడో వికెట్ గా వెనుతిరిగాడు.. ఆ త‌ర్వాత బంతికే అనుకూల్ రాయ్ సున్న పరుగుల‌కు కుల‌దీప్ ప‌డ‌గొట్టాడు. ఆ తర్వాత మూడు పరుగులు చేసిన ఉమేష్ యాదవ్ ను నోకియా పెవిలియన్ కు పంపాడు. అంత‌కుముందు 2 ప‌రుగులు చేసిన సునీల్ న‌రైన్ ను అక్ష‌ర ప‌టేల్ ఔట్ చేశాడు. రింకూ సింగ్ 6 ప‌రుగులు చేసి అక్ష‌ర ప‌టేట్ బౌలింగ్ లో ఔట‌య్యాడు. అంత‌కు ముందు 12 ప‌రుగులు చేసిన మ‌న్ దీప్ సింగ్ ను అక్ష‌ర ప‌టేల్ నాలుగో వికెట్ గా ప‌డ‌గొట్టాడు.. నాలుగు ప‌రుగులు చేసిన రానా మూడో వికెట్ గా వెనుతిరిగాడు.. ఈ వికెట్ ఇషాంత్ శ‌ర్మ‌కు ల‌భించింది.. కాగా, తొలి వికెట్ గా లింట‌న్ దాస్, రెండో వికెట్ గా వెంక‌టేష్ అయ్య‌ర్ లు వెంట‌వెంట‌నే అవుల‌య్యారు.. లింట‌న్ 4 ప‌రుగులు చేయ‌గా, అయ్య‌ర్ డ‌కౌట్ గా వెనుతిరిగాడు .. లింట‌న్ వికెట్ ముఖేష్ కుమార్, అయ్యార్ వికెట్ నోకియాకు ల‌భించాయి.. నిర్ధారిత 20 ఓవ‌ర్లో 127 ప‌రుగుల‌కు అలౌట్ అయింది. డిసి బౌల‌ర్ల‌లో ఇషాంత్ శ‌ర్మ‌, కుల‌దీప్ యాద‌వ్, అక్ష‌ర ప‌టేల్ , నోకియాలు రెండేసి వికెట్లు ప‌డ‌గొట్టారు.. ముఖేష్ కు ఒక వికెట్ ద‌క్కింది. కాగా, ఇప్పటివరకు అన్ని జట్లు కనీసం రెండు మ్యాచ్ లలో అయినా విజయాలు సాధించగా.. వార్నర్‌ సేన ఇప్పటివరకు బోణీ కూడా కొట్టలేదు. ఆడిన ఐదు మ్యాచ్ లలో వరుసగా 5 మ్యాచ్‌లో ఓడిపోయి ప్లేఆఫ్స్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే ఢిల్లీ జట్టు గెలుపు బాట పట్టాల్సిన అవసరం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement