Thursday, April 18, 2024

Crick Buz: టెస్ట్‌ క్రికెట్‌ కు రవీంద్ర జడేజా బై బై.. ఎందుకంటే..

టీమిండియా ఆల్ రౌండ‌ర్‌ రవీంద్ర జడేజా టెస్ట్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈ మ‌ధ్య‌ న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో మోకాలి గాయంతో జడేజా తప్పకున్నాడు. అయితే మోకాలి సర్జరీ త‌ర్వాత‌ దాదాపు 6 నెలల పాటు విశ్రాంతి తీసుకోనున్న జడేజా టెస్ట్‌ క్రికెట్‌కు ఇక‌మీద‌ట పూర్తిగా గుడ్ బై చెప్ప‌నున్న‌ట్టు స‌మాచారం. ఆ త‌ర్వాత‌ వన్డే, టీ20 ఫార్మాట్లపై దృష్టి సారించాలని జ‌డేజా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా జడేజా సన్నిహితుడు ఒక ప్రముఖ పత్రికకు తెలిపారు.

గాయం కారణంగానే దక్షిణాఫ్రికా పర్యటనకు కూడా జడేజా దూరమయ్యాడు. ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్ లో 57 మ్యాచ్‌లు ఆడిన రవీంద్ర జడేజా 2,195 పరుగులతో పాటు 232 వికెట్లు పడగొట్టాడు. మరోపక్క చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం రవీంద్ర జడేజాని 16 కోట్లకు రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement