Saturday, April 20, 2024

అర్జున అవార్డు అందుకున్న చతేశ్వర్‌ పుజారా.. ప్ర‌దానం చేసిన క్రీడల మంత్రి

భారత టెస్ట్‌ జట్టు ఆటగాడు చతేశ్వర్‌ పుజారా ఐదేళ్ల తర్వాత అర్జున అవార్డు అందుకున్నాడు. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాగూర్‌ చేతుల మీదుగా పూజారా ఈ అవార్డు అందుకున్నాడు. 2017లో పూజారాకు కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డును ప్రకటించింది. అయితే ఆ ఏడాది అతను అవార్డు వేడుకకు హాజరు కాలేదు. ఐదేళ్ల తర్వాత అర్జున అవార్డు అందుకున్న పూజారా ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు.

” ఆలస్యం అయినా కూడా నాకు సన్మానం చేసి అవార్డు ప్రదానం చేసినందుకు బీసీసీఐ, కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌కి ధన్యవాదాలు. తీరిక లేని క్రికెట్‌ షెడ్యూల్‌ కారణంగా ఆ ఏడాది అవార్డు అందుకోలేకపోయాను. అవార్డు వచ్చినందుకు చాలా ఆనందంగా, గర్వంగా ఉంది” అంటూ పూజారా ట్వీట్‌ చేశాడు.

రాహుల్‌ ద్రవిడ్‌ తర్వాత భారత టెస్ట్‌ జట్టుకు మరో వాల్‌గా పుజారా పేరు తెచ్చుకున్నాడు. ఈ మధ్యే కౌంటీ క్రికెట్‌లో అదరగొట్టిన పూజారా బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళుతున్న భారత టెస్ట్‌ జట్టుకు పూజారా ఎంపికయ్యాడు. టీమిండియా , బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడనుంది. ఈ స్టార్‌ బ్యాటర్‌ ఇప్పటివరకు 96 టెస్ట్‌లు ఆడాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement