Wednesday, April 24, 2024

కరోనా పై పోరుకు భారత్ కు ఒక బిట్ కాయిన్ ను విరాళంగా ప్రకటించిన: బ్రెట్ లీ..

భారత్ లో కరోనా సంక్షోభం పట్ల ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్ లీ విచారం వ్యక్తం చేశాడు. కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తున్న భారత్ కు తన వంతుగా సాయం చేశాడు. ప్రస్తుతం మహమ్మారి ధాటికి భారత ప్రజలు విలవిల్లాడుతున్న తీరు తీవ్ర విచారం కలిగిస్తోంది. ఈ పరిస్థితి పట్ల స్పందించి నా వంతుగా సాయం చేయడాన్ని బాధ్యతగా భావిస్తున్నాను భారత్ లో కొవిడ్ బాధితులకు ఆక్సిజన్ సరఫరా కోసం ఒక బిట్ కాయిన్ ను క్రిప్టో రిలీఫ్ సంస్థకు విరాళంగా ఇస్తున్నాను. ప్రస్తుత మార్కెట్ ప్రకారం ఒక బిట్ కాయిన్ కు భారత కరెన్సీలో రూ.40,95,772 విలువ ఉంది. తన విరాళం గురించి బ్రెట్ లీ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.

ఆపదలో ఉన్నవారికి సాయం చేయడానికి అందరం ఏకమవ్వాల్సిన సమయం ఇది. ఈ కష్టకాలంలో ముందుండి నిలిచి పోరాడుతున్న కొవిడ్ యోధులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాన్నాడు బ్రెట్ లీ. “నా వరకు భారత్ ను ఎప్పటికీ మరో సొంతిల్లుగానే భావిస్తాను. నేను క్రికెటర్ గా ఉన్నప్పుడు, రిటైర్ అయిన తర్వాత కూడా ఇక్కడి ప్రజలు చూపించిన ప్రేమ, ఆప్యాయతలకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుందన్నాడు బ్రెట్ లీ. ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కొవిడ్ పట్ల ఎంతో అప్రమత్తంగా ఉండాలి” అని బ్రెట్ లీ పేర్కొన్నారు. అంతేకాదు, నిన్న భారత్ కోసం 50 వేల డాలర్లు విరాళం ప్రకటించిన తమ దేశానికే చెందిన ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ ను బ్రెట్ లీ మనస్ఫూర్తిగా అభినందించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement