Friday, March 29, 2024

Crick Buz: 62 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్..

సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా బౌల‌ర్ల ధాటికి న్యూజిలాండ్ బ్యాట్స్‌మ‌న్ ప‌రుగులు చేయ‌లేక తంటాలు ప‌డ్డారు. రెండో రోజు జ‌రిగిన ఆట తీరును ప‌రిశీలిస్తే ఇదే తెలుస్తోంది. తొలుత మూడో ఓవ‌ర్‌లోనే ప‌ది రన్స్ చేసిన టామ్ లాథ‌మ్‌ని మ‌హ్మ‌ద్ సిరాజ్ అవుట్ చేశాడు. ఆ త‌ర్వాత‌.. విల్ యంగ్ 4 ప‌రుగులు మాత్ర‌మే చేసి అవుట‌య్యాడు. డారీ మిచ్చెల్ 8, రాస్ టేల‌ర్ 1, హెన్రీ నిఖోల‌స్ 7, టామ్ బ్లండెల్ 8, ర‌చిన్ ర‌వీంద్ర 4, టిమ్ సోథీ 0 ప‌రుగులు మాత్ర‌మే చేశారు.

వీరిలో రెండంకెల ప‌రుగులు చేసింది ఒక్క టామ్ లాథ‌మ్ (10) మాత్ర‌మే అని చెప్పొచ్చు. మిగ‌తా వారిలో అంద‌రూ సింగిల్ డిజిట్‌కే ప‌రిమిత‌మ‌య్యారు. అంటే టీమిండియా బ్యాట్స్‌మ‌న్ న్యూజిలాండ్ బ్యాట్స్‌మ‌న్‌కు ప‌గ‌లే చుక్క‌లు చూపించార‌ని క్రికెట్ అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. కాగా, మ‌హ్మ‌ద్ సిరాజ్‌, ర‌విచంద్ర‌న్ అశ్విన్ త‌లా 3 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. అక్ష‌ర్ ప‌టేల్‌, జ‌యంత్ యాద‌వ్ త‌లా ఒక వికెట్ తీశారు. ఆట ఇంకా కొన‌సాగుతోంది.. 3.34 నిమిషాలకు 28 ఓవ‌ర్లలో 62/10గా న్యూజిలాండ్ స్కోరు ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement