Thursday, April 25, 2024

IPL | బిగ్​ టార్గెట్​ చేజింగ్​లో ఢిల్లీ తడబాటు.. లక్నో విన్​

ఐపీఎల్​లో ఇవ్వాల (శనివారం) రాత్రి జరిగిన లక్నో, ఢిల్లీ మ్యాచ్లో ఢిల్లీ తడబాడుకు గురయ్యింది. త్వరత్వరగా వికెట్లు కోల్పోయి లక్ష్య ఛేదనలో వెనకబడింది. దీంతో అనూహ్యంగా లక్నో సూపర్​ జెయింట్స్​ని విజయం వరించింది. ఢిల్లీ జట్టులో డేవిడ్​ వార్నర్​ (56), రీల్స్​ రోసోవ్​ (30), అక్షర్​ పటేల్​ (16) పృథ్వీషా (12) మినహా.. మరెవ్వరూ రెండంకెల స్కోరు చేయలేదు.

ఇక.. కట్టుదిట్టమైన బౌలింగ్​తో లక్నో బౌలర్లు అదుర్స్​ అనిపించారు. ఢిల్లీ జట్టుపై 50 పరుగుల తేడాతో లక్నో సూపర్​ జెయింట్స్​ విజయం సాధించింది. 194 పరుగుల టార్గెట్​ని చేజ్​ చేయడంలో ఢిల్లీ జట్టు ఒత్తిడికి గురయ్యింది.. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 143 పరుగులు మాత్రమే చేసి. తొమ్మిది వికెట్లను కోల్పోయి ఓటమి చెందింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement