Friday, April 19, 2024

ఐసీసీని విమర్శించిన బెన్‌ స్టోక్స్‌

మ్యాచ్‌ల షెడ్యూల్‌ మీద అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసిసి) దృష్టి పెట్టడం లేదని ఇంగ్లండ్‌ టెస్ట్‌ కె ప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ విమర్శించాడు. ప్రపంచవ్యాప్తంగా దేశవాళీ టీ 20 లీగ్‌లు పాపులర్‌ కావడంతో టెస్ట్‌ క్రికెట్‌ ప్రమాదంలో పడుతోందని స్టోక్స్‌ అన్నాడు. ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ ఇయాన్‌ బోథంతో కలిసి బీబీసీతో మాట్లాడుతూ ‘షెడ్యూల్‌ మీద ఐసీసీ అంత దృష్టి పెట్టడం లేదు. టీ 20 ప్రపంచకప్‌ ముగిసిన వెంటనే ఇం గ్లండ్‌, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్‌ నిర్వహించడం అందుకు ఉదాహరణ. వన్డే సిరీస్‌లోనే మూడు ఫార్మట్‌లు ఉన్నాయి అన్నట్టు ఐసీసీ ధోరణి ఉంది. టీ 20 లీగ్‌ల కారణంగా టెస్ట్‌ క్రికెట్‌ మీద అభిమానుల్లో ఆసక్తి తగ్గిపోతుంది. క్రికెటర్లు ఆడడానికి చాలా ఫార్మట్లు ఉన్నాయి. అయితే నా వరకు మాత్రం టెస్ట్‌ ఫార్మెట్‌ అనేది క్రికెట్‌కు చాలా ముఖ్యం” అని స్టోక్స్‌ అన్నాడు.

టెస్ట్‌ క్రికెట్‌ ఆడే దేశాలు ఇంగ్లండ్‌ మాదిరిగా అటాకింగ్‌ గేమ్‌ ఆడాలని స్టోక్స్‌ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్‌ ఫలితం కంటే అభిమానులను అలరించడం ముఖ్యం కావాలని, అప్పుడే టెస్ట్‌ క్రికెట్‌ మళ్లిd పాపులర్‌ అవుతుందని తెలిపాడు. స్టోక్స్‌ కంపెనీలో ఇంగ్లండ్‌ జట్టు 3-0తో పాకిస్థాన్‌పై టెస్ట్‌ సిరీస్‌ నెగ్గింది. మూడు టెస్టుల సిరీస్‌లో పాక్‌ను వైట్‌ వాష్‌ చేసింది. దాంతో ఐపిఎల్‌ 2023 మినీ వేలంలో ఈ ఇంగ్లండ్‌ ఆల్‌ రౌండర్‌ భారీ ధర పలికాడు. చెన్నయ్‌ సూపర్‌ కింగ్స్‌ అతడిని రూ 16.25 కోట్లకు కొనుగోలు చేసింది. పోయిన ఏడాది స్టోక్స్‌ రాయల్స్‌ తరపున ఆడాడు. 2019 ప్రపంచకప్‌లో అద్బుతంగా ఆడిన స్టోక్స్‌ మ్యాచ్‌ను సూపర్‌ ఓవర్‌ వరకు తెచ్చాడు. సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించిన ఇంగ్లడ్‌ తొలిసారివన్డే ప్రపంచకప్‌ అందుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement