Thursday, April 25, 2024

Dhaka 2nd ODI : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్

బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా రెండో వన్డే మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. బంగ్లాదేశ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్‌లో ఓటమి అనంతరం సిరీస్ వెనుకంజలో ఉన్న టీమిండియా.. రెండో వన్డేలో నెగ్గి సమం చేయాలని భావిస్తోంది. మరో పక్క ఆతిథ్య జట్టు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌కు ఢాకా షేర్ బంగ్లా నేషనల్ స్టేడియం వేదిక కానుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా 0-1 తేడాతో వెనుకంజలో ఉన్న టీమిండియా.. సిరీస్ గెలవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిందే. లేకుంటే సిరీస్ ఆశలు చేజారుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement