Thursday, November 7, 2024

T20 World Cup | బంగ్లాదేశ్‌ బోణి..

మహిళల టీ20 వరల్డ్‌కప్‌-2024లో బంగ్లాదేశ్ జ‌ట్టు బోణి కొట్టింది. నేడు జరిగిన మ్యాచ్ లో బంగ్లా మహిళల జట్టు స్కాట్లాండ్‌పై 16 పరుగుల తేడాతో గెలుపొందింది. షార్జా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది.

36 పరుగులు చేసిన శోభన మోస్తరీ టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. శాంతి రాణి (29), ముర్షిదా ఖాతూన్‌ (12), నిగార్‌ సుల్తానా (18), ఫాతిమా ఖాతూన్‌ (10 నాటౌట్‌) రెండంకెల స్కోర్లు చేశారు. స్కాట్లాండ్‌ బౌలర్లలో సస్కియా హోర్లీ మూడు వికెట్లు పడగొట్టగా.. బ్రైస్‌, ఒలివియా బెల్‌, కేథరీన్‌ ఫ్రేసర్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం 120 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో​కి దిగిన స్కాట్లాండ్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసి 16 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రీతూ మోనీ 2, రబేయా ఖాన్‌, మరుఫా అక్తెర్‌, నహిదా అక్తెర్‌, ఫాహిమా ఖాతూన్‌ తలో వికెట్‌ తీసి స్కాట్లాండ్‌ను కట్టడి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement