Sunday, January 5, 2025

U19 Asia Cup | పాక్ ఇంటికి.. బంగ్లా ఫైన‌ల్స్ కు !

అండర్-19 ఆసియా కప్ 2024 టోర్నమెంట్‌లో భాగంగా ఈరోజు జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ జ‌ట్టు ఓట‌మిపాలైంది. ఈరోజు బంగ్లాదేశ్‌తో ఫైనల్ బెర్త్ కోసం జరిగిన పోరులో పాకిస్థాన్ చిత్తు చిత్తుగా ఓడింది. దీంతో బంగ్లాదేశ్ జ‌ట్టు ఫైన‌ల్స్ కు చేరింది.

కాగా, ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేప‌ట్ట‌ని పాక్ 116 ఆలౌటైంది. బంగ్లాదేశ్ బౌలర్లలో ఇక్బాల్ హొస్సేన్ ఎమోన్ నాలుగు వికెట్లతో పాక్ పతనాన్ని శాశించాడు. ఇక‌ మరుఫ్ మృధా రెండు వికెట్లు తీయ‌గా… అల్ ఫహద్, దేబాసిష్ దేబా ఒక్కో వికెట్ తీశారు.

అనంత‌రం స్వ‌ల్ప ల‌క్ష్యంతో చేజింగ్ కు దిగిన బంగ్లా.. పాక్ బౌల‌ర్ల‌ను ఉతికారేస్తూ 22.1 ఓవ‌ర్ల‌లోనే మ్యాచ్ ను ముగించేసింది. కెప్టెన్ అజీజుల్ హకీమ్ (61 నాటౌట్) చెల‌రేగాడు. ఓపెన‌ర్ జవాద్ అబ్రార్ (17), మిడిలార్డ‌ర్ లో మహ్మద్ షిహాబ్ జేమ్స్ (26) పరుగులు చేశారు. దీంతో ఏడు వికెట్ల తేడాతో విజ‌యం సాధించిన బంగ్లా.. ఫైన‌ల్స్ కు చేరింది.

ఇక‌ డిసెంబర్ 10న దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్లో యువ భార‌త్ – బంగ్లాదేశ్ జ‌ట్లు తలపడనున్నాయి. శ్రీలంక‌తో జరిగిన రెండో సెమీఫైనల్లో భార‌త‌ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement