Thursday, April 25, 2024

Breaking: నిల‌క‌డ‌గా ఆడుతున్న బెంగ‌ళూరు.. ఆన‌వ‌స‌ర షాట్‌కు య‌త్నించి అవుటైన కోహ్లీ!

రాజస్థాన్‌తో జరుగుతున్న క్వాలిఫ‌య‌ర్‌2 మ్యాచ్‌లో బెంగళూరు బ్యాటింగ్ బెట‌ర్‌గానే ఉంది. రెండో ఓవర్లోనే కీలకమైన కోహ్లీ (7) వికెట్ కోల్పోయినా.. ఆ తర్వాత వచ్చిన పటీదార్, డుప్లెసిస్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. అనవసర షాట్లకు పోకుండా అడపాదడపా బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు న‌డిపిస్తున్నారు. ఈ క్రమంలోనే పవర్‌ప్లే ముగిసే సరికి బెంగళూరు జట్టు ఒక వికెట్ నష్టానికి 46 పరుగులు చేసింది. కాగా 9వ ఓవ‌ర్ వ‌ర‌కు 69 ప‌రుగులు, ఒక వికెట్ కోల్పోయి మంచి స్కోరు దిశ‌గా ప‌య‌నిస్తోంది. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన రెండో ఓవర్లో అనవసరమైన షాట్‌కు ప్రయత్నించిన కోహ్లీ వికెట్ పారేసుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement