Saturday, April 20, 2024

లార్డ్స్ టెస్ట్ లో బాల్ టాంపరింగ్..చర్యలుండవా..?

ఇండియా – ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మరో వివాదానికి తెరలేవనున్నుంది. అదే బాల్ టాంపరింగ్. అవును లార్డ్స్ టెస్ట్ లో బాల్ టాంపరింగ్ కలకలం రేపుతోంది. నాలుగో రోజు సెకండ్ సెషన్‌లో ఇంగ్లండ్ ఫీల్డర్లు షూ స్పైక్‌లతో బంతి లయను దెబ్బతీసేందుకు ప్రయత్నించే వీడియో కనిపించింది. మ్యాచ్ సమయంలో ఈ వీడియో టీవీలో కనిపించింది. అయితే, వీడియోలో బూట్లు మాత్రమే కనిపించడంతో బంతిని ట్యాంపరింగ్ చేసిన ఆటగాళ్లు ఎవరనేది స్పష్టంగా తెలియలేదు. అయితే, పసుపు సోల్ ఉన్న ఆటగాడు షూ కింద బంతిని నొక్కినట్లు కనిపించింది. బంతి నుంచి స్వింగ్ పొందడానికి ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ బౌలర్ల వైపు నుంచి ఇలాంటి ప్రయత్నాలు కనిపించడంతో.. బాల్ టాంపరింగ్ చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో సైతం బంతిని బూట్ల కింద పెట్టి దాని ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఫోటోలో వైరల్ అవుతున్నాయి. బంతిని ట్యాంపర్ చేసేందుకు మూడుసార్లు ప్రయత్నించినట్టు వెలుగులోకి వచ్చిన ఫొటోల ద్వారా తెలుస్తోంది. ఈ విషయంపై ఇంగ్లండ్ బోర్డు వివరణ ఇస్తుందో, లేదో చూడాలి.

తాజా ఫొటోలు 2018 నాటి కేప్‌టౌన్ టెస్టును గుర్తుకు తెస్తున్నాయి. అప్పట్లో ఆసీస్ ఆటగాడు కేమరాన్ బాన్‌క్రాఫ్ట్ ప్యాంట్ జేబులోంచి యెల్లో పేపర్ తీసి బంతిని ట్యాంపర్ చేస్తూ వీడియో కెమెరాకు చిక్కాడు. ఈ కేసులో అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌పై ఆసీస్ బోర్డు 12 నెలల నిషేధం విధించగా, బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధం విధించింది.

ఇది కూడా చదవండి: ఇండియన్ ఐడల్-12 విన్నర్ పవన్ దీప్..

Advertisement

తాజా వార్తలు

Advertisement